EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu1e2e2431-2664-49e3-a6c6-946e12736b66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu1e2e2431-2664-49e3-a6c6-946e12736b66-415x250-IndiaHerald.jpgతెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాదులో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ రంగానికి మూల పురుషుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఐటి ఉద్యోగులు కూడా ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ లో ఐటీ అభివృద్ధి చెందిందని, ఆయన వల్లే ఉపాధి అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా ఉద్యోగులు చెప్పడం జరిగింది. అంతే కాకుండా మా జీవితంలో వెలుగులు నింపినటు వంటి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం అంటూ ఉద్యోగులుCHANDRABABU{#}Telugu Desam Party;Wipro;TDP;Telangana;CBN;police;Partyహైదరాబాద్ తెలుగుదేశం ఉద్యమానికి బ్రేక్?హైదరాబాద్ తెలుగుదేశం ఉద్యమానికి బ్రేక్?CHANDRABABU{#}Telugu Desam Party;Wipro;TDP;Telangana;CBN;police;PartySat, 16 Sep 2023 22:23:25 GMTతెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాదులో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ రంగానికి మూల పురుషుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఐటి ఉద్యోగులు కూడా ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ లో ఐటీ అభివృద్ధి చెందిందని, ఆయన వల్లే  ఉపాధి అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా ఉద్యోగులు చెప్పడం జరిగింది.


అంతే కాకుండా మా జీవితంలో వెలుగులు నింపినటు వంటి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం అంటూ ఉద్యోగులు పేర్కొన్నారు అని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడుపై అక్రమంగా  ఆరోపణలు చేసి జైల్లో పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేసి ఆయన్ని విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఐటీ అంటే బాబుగారు, బాబుగారు అంటే ఐటి అంటూ ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు.


విప్రో సర్కిల్‌ వద్ద మొదలైన ఈ భారీ ర్యాలీ ఔటర్ రింగ్ రోడ్డు వరకు జరిగింది. అయితే ఇలాంటివి తెలంగాణ ప్రభుత్వానికి నచ్చవని అంటున్నారు కొంతమంది. అక్కడ ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో  పోలీసులు తమ కర్తవ్యాన్ని చేపట్టారు. అయితే మొదట్లో మొహమాటంతో, చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి సంబంధించిన  అధికారులు చెప్పారని ఎంప్లాయిస్ ఈ ఆందోళనలకు వెళ్లారట.


రెండో రోజు ఇలా విప్రో సర్కిల్ దగ్గర  ఆందోళన చేద్దాం అని చెప్పుకొని అక్కడ జమ కూడారట. అయితే అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిందని తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమాన్ని గనుక భగ్నం చేస్తే  వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని టిడిపి సోషల్ వింగ్ కు సంబంధించిన వ్యక్తులు అన్నారని తెలుస్తుంది. కొన్ని ఐటీ కంపెనీలు అయితే తమ ఉద్యోగులను ఈ ఆందోళనలో పార్టిసిపేట్‌ చేయొద్దని గట్టిగా చెప్పాయట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సైమా వేడుకలలో మెరిసిన హీరోయిన్స్ వీళ్ళే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>