MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg‘డీజే టిల్లు’ ఘనవిజయం సాధించడంతో సిద్దూ జొన్నలగడ్డ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనితో అతడికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఆ అవకాశాలను అంగీకరించకుండా సిద్దూ తన దృష్టి అంతా ‘టిల్లు స్క్వేర్’ పై పెట్టాడు. ఈ సినిమా కూడ ఘనవిజయం సాధిస్తే ఇక సిద్దూ కెరియర్ కు ఇండస్ట్రీలో తిరుగు ఉండదు. వాస్తవానికి ఈసినిమాను సెప్టెంబర్ 15 తారీఖున వినాయకచవితిని టార్గెట్ చేస్తూ విడుదల చేద్దామని భావించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడ ఎప్పుడో విడుదల అయింది. అయితే ఈ మూవీ విడుదల అనుకున్న తేదీకి రాకపోవడDJTILLU{#}December;Romantic;september;News;Cinemaషాకింగ్ టిల్లు స్క్వేర్ కు రిపేర్లు ?షాకింగ్ టిల్లు స్క్వేర్ కు రిపేర్లు ?DJTILLU{#}December;Romantic;september;News;CinemaFri, 15 Sep 2023 13:13:38 GMT‘డీజే టిల్లు’ ఘనవిజయం సాధించడంతో సిద్దూ జొన్నలగడ్డ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనితో అతడికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఆ అవకాశాలను అంగీకరించకుండా సిద్దూ తన దృష్టి అంతా ‘టిల్లు స్క్వేర్’ పై పెట్టాడు. ఈ సినిమా కూడ ఘనవిజయం సాధిస్తే ఇక సిద్దూ కెరియర్ కు ఇండస్ట్రీలో తిరుగు ఉండదు.  


వాస్తవానికి ఈసినిమాను సెప్టెంబర్ 15 తారీఖున వినాయకచవితిని టార్గెట్ చేస్తూ విడుదల చేద్దామని భావించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడ ఎప్పుడో విడుదల అయింది. అయితే ఈ మూవీ విడుదల అనుకున్న తేదీకి రాకపోవడానికి ఈమూవీ అవుట్ పుట్ సిద్దూ జొన్నలగడ్డ కోరుకున్న విధంగా రాకపోవడం అంటూ ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి.  


దీనితో ఈసినిమాకు సంబంధించిన రీ ఘాట్ జరుగుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో సిద్దూ కి అనుపమ పరమేశ్వరన్ కు మధ్య తీసిన రొమాంటిక్ సీన్స్ సిద్దూ కి పూర్తిగా నచ్చకపోవడంతో అనుపమ డేట్స్ తీసుకుని మళ్ళీ ఆ సీన్స్ ను రీ ఘాట్ చేస్తున్నారని టాక్. దీనితో ఈ రీఘాట్ పూర్తి చేసుకుని ఈసంవత్సరం ఈమూవీ విడుదల ఉంటుందా అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


సిద్దూ జొన్నలగడ్డ కేవలం నటుడు మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన డైలాగ్స్ స్క్రీన్ ప్లే వ్రాసే విషయంలో కూడ చాల అనుభవం ఉంది. ఇప్పుడు ఆ అనుభవంతోనే సిద్దూ తన ‘డిజే టిల్లు స్క్వేర్’ కు రిపేర్లు చేస్తున్నారు అనుకోవాలి. అయితే ఈ మూవీ విడుదల ఆలస్యం అవుతున్న కొద్దీ ఈమూవీ పై ఏర్పడ్డ క్రేజ్ నెమ్మదిగా తగ్గిపోయే ఆస్కారం ఉందని ఈ మూవీని ఇప్పటికే కొనుకున్న బయ్యర్లు భయపడుతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే డిసెంబర్ జనవరి నెలలకు సంబంధించిన డేట్స్ అన్నీ ఫీలప్ అవ్వడంతో జొన్నలగడ్డ మూవీ విడుదల వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మాత్రమే ఉండవచ్చని సంకేతాలు వస్తున్నాయి..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>