LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health3bceea48-0730-454a-bb06-d5c4218698ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health3bceea48-0730-454a-bb06-d5c4218698ca-415x250-IndiaHerald.jpgవర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉంటుంది. అందువల్ల గాలిలోనే బ్యాక్టీరియా తిరుగుతూ ఉంటుంది. కూరగాయలు, పండ్లలో బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది.వీటిని సరైన జాగ్రత్తలో తీసుకోకపోతే ఖచ్చితంగా ఇన్ ఫెక్షన్లు తీసుకొస్తాయి. అందువల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీకున్నా కూడా ఇంట్లో ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతూనే ఉంటారు. అయితే ఈ వర్షా కాలంలో కొన్ని రకాల పండ్లు ఇంకా కాయ గూరలు తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారHEALTH{#}Manamవర్షాకాలంలో అస్సలు తీసుకోకూడని ఆకుకూరలు ఇవే?వర్షాకాలంలో అస్సలు తీసుకోకూడని ఆకుకూరలు ఇవే?HEALTH{#}ManamFri, 15 Sep 2023 22:35:00 GMTవర్షాకాలంలో వాతావరణంలో తేమ  ఉంటుంది. అందువల్ల గాలిలోనే బ్యాక్టీరియా తిరుగుతూ ఉంటుంది. కూరగాయలు, పండ్లలో బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది.వీటిని సరైన జాగ్రత్తలో తీసుకోకపోతే ఖచ్చితంగా ఇన్ ఫెక్షన్లు తీసుకొస్తాయి. అందువల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీకున్నా కూడా ఇంట్లో ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతూనే ఉంటారు. అయితే ఈ వర్షా కాలంలో కొన్ని రకాల పండ్లు ఇంకా కాయ గూరలు తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వానా కాలంలో వంకాయల్లో  ఎక్కువగా కీటకాలు, బ్యాక్టీరియా ప్రవేశిస్తూ ఉంటాయి. వంకాయలకు ఎక్కువగా కీటకాల ముప్పు అనేది ఉంది. కాబట్టి వీటిని  జాగ్రత్తగా వండుకోవాలి. లేదంటే దీని వల్ల ఆరోగ్యం సంగతి పక్కన పెడితే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వెంటాడుతాయి.దురద, అలర్జీ, విరోచనాలు ఇంకా ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన వలసి ఉంటుంది. ఇంకా అంతే కాకుండా ఇవి గ్యాస్, బర్నింగ్ సన్సేషన్ కూడా పెంచుతుంది.


కాబట్టి వర్షాకాలంలో వీటికి చాలా దూరంగా ఉంటే బెటర్. ఇంకా ఈ వర్షా కాలంలో టమాటాలను తింటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదు.ఎందుకంటే టమాటాలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వంటల్లో టమాటాల మోతాదు తగ్గిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే అల్లంని కూడా  వర్షా కాలంలో చాలా తక్కువ మోతాతులో తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉండే ఘాటు వల్ల ఇది కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను పెంచుతుంది.ఇంకా ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివే అయినా వర్షా కాలం వచ్చేసరికి ఖచ్చితంగా వీటికి కాస్త దూరంగా ఉండటం చాలా బెటర్. ఆకు కూరల్లో కూడా బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు ఇంకా కీటకాలు ప్రవేశిస్తాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి వండుకుని తినాలి. వీటిని హడా విడిగా అస్సలు చేయకూడదు. లేదంటే ఖచ్చితంగా ఇన్ ఫెక్షన్లు, జీర్ణ క్రియ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>