MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7102612b-8aca-42d5-b04a-5736a3c7f4fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7102612b-8aca-42d5-b04a-5736a3c7f4fb-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా జవాన్ సినిమానే కనబడుతోంది. ఆ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఆడియన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్లో తక్కువ సమయంలో రూ.300 కోట్ల మార్క్ ని దాటికి సరికొత్త రికార్డు నెలకొల్పింది. షారుక్ గత చిత్రం 'పఠాన్' కూడా తక్కువ సమయంలో రూ.300 కోట్ల tollywood{#}priyamani;Joseph Vijay;Darsakudu;Dalapathi;Chitram;Audience;Director;Shahrukh Khan;atlee kumar;Jawaan;News;Cinema;Heroine'జవాన్' డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..!?'జవాన్' డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..!?tollywood{#}priyamani;Joseph Vijay;Darsakudu;Dalapathi;Chitram;Audience;Director;Shahrukh Khan;atlee kumar;Jawaan;News;Cinema;HeroineFri, 15 Sep 2023 12:25:00 GMTజవాన్ సినిమానే కనబడుతోంది. ఆ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఆడియన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్లో తక్కువ సమయంలో  రూ.300 కోట్ల మార్క్ ని దాటికి సరికొత్త రికార్డు నెలకొల్పింది. షారుక్ గత చిత్రం 'పఠాన్' కూడా తక్కువ సమయంలో రూ.300 కోట్ల మార్క్ ని అందుకొని అరుదైన ఘనత సాధించడం విశేషం. 

అలా 'జవాన్' లో కీలక పాత్ర పోషించి ఆడియన్స్ ని ఆకట్టుకుంది సౌత్ హీరోయిన్ ప్రియమణి. సినిమాలో లక్ష్మి అనే పాత్ర పోషించింది  అలాగే షారుఖ్ ఖాన్ గర్ల్స్ స్క్వాడ్ లో మెయిన్ మెంబర్ గా అదరగొట్టింది. ఇదిలా ఉంటె అట్లీ తనను మోసం చేశాడని ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. రిలీజ్ కి ముందు 'జవాన్' సినిమాపై చాలా రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తలపతి విజయ్ క్యామియో రోల్ చేస్తున్నారనే వార్త ఎంతో వైరల్ అయింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక అది అబద్ధమని తెలిసింది. అయితే ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ సినిమాలో షారుక్ తో పాటు తలపతి విజయ్ కూడా ఉన్నట్లు అట్లీ తనతో చెప్పాడని,

 దాంతో ఎలాగైనా విజయ్తో తనకు ఓ సీన్ ఉండేలా చూడమని తాను అట్లీ ని కోరినట్లు ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది." డైరెక్టర్ అట్లీ వీడియో కాల్ లో మాట్లాడుతూ జవాన్ లో నటించమని అడిగారు. అయితే నేను స్పెషల్ సాంగ్ ఏమో అని ముందు అనుకున్నా. ఆ తర్వాత కీరోల్ అని చెప్పారు. అలాగే సినిమాలో దళపతి విజయ్ కామియో రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది అది నిజమేనా అని అడిగాను. దానికి అట్లీ విజయ్ గారితో చేపించేస్తే పోతుంది ఏముంది అన్నాడు. అలాగే నాకు విజయ్ తో సన్నివేశం ఉండేలా చూడండి అని అన్నాను. కానీ ఆ తర్వాత సినిమాలో విజయ్ నటించలేదు. ఈ విషయంలో అట్లే నన్ను మోసం చేశారు" అని సరదాగా చెప్పుకొచ్చింది ప్రియమణి. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>