EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/teta2935d16-cb49-4d0d-b878-b2e28e17ff43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/teta2935d16-cb49-4d0d-b878-b2e28e17ff43-415x250-IndiaHerald.jpgఇవాళ తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగబోతోంది. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ ఉంటుంది. మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ టూ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ వన్ కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేశారు. దీని కోసం 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయనున్నారు. దీని కోసం 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. టెట్ జరగనున్న విద్యా సంస్థలకు TET{#}vidya;Qualification;November;Evening;October;June;Telangana;Application;Governmentనేడే టెట్‌ పరీక్ష.. ఈ రూల్స్ మస్ట్‌?నేడే టెట్‌ పరీక్ష.. ఈ రూల్స్ మస్ట్‌?TET{#}vidya;Qualification;November;Evening;October;June;Telangana;Application;GovernmentFri, 15 Sep 2023 00:00:00 GMTఇవాళ తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగబోతోంది. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ ఉంటుంది. మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ టూ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ వన్ కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేశారు. దీని కోసం 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయనున్నారు. దీని కోసం 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.


టెట్ జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా సెలవు ప్రకటించింది. పరీక్ష కోసం 2 వేల 52 చీఫ్ సూపరింటెండెంట్లు, 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు, 10 వేల 260 మంది హాల్ సూపరింటెండెట్లను నియమించింది. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతించరు. ఇక మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో ఓఎంఆర్ పత్రాల్లో సర్కిళ్లను దిద్దాలి. ఈనెల 27న టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.


జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్‌ అర్హత ఉండాలి.  తెలంగాణలో ఇప్పటివరకు అన్ని టెట్ లు కలిపి పేపర్ 1 లో లక్షన్నర..  పేపర్ 2 లో రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. చివరగా గతేడాది జూన్ 12న టెట్ నిర్వహించారు.  టెట్ అర్హత కాల పరిమితి జీవితకాలం ఉంటుందని తెలిపారు.


ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయిన సంగతి తెలిసిందే. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష ఉంటుంది. దీని కోసం ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మాట చెబితే కేసీఆర్‌ ఫ్యామిలీ వణికిపోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>