EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bhuvaneswaricbab462e-401b-420b-b126-a0b7045f8e21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bhuvaneswaricbab462e-401b-420b-b126-a0b7045f8e21-415x250-IndiaHerald.jpgఏ భార్యకైనా తన భర్త ప్రధమ దైవం. స్త్రీ చిన్నతనం నుండి తన తండ్రిని ఎంత ఆరాధిస్తుందో, పెళ్లి అయిన తర్వాత తన భర్తను అంతకన్నా ఎక్కువ ఆరాధిస్తుంది. సాధారణ భర్తలనే భార్యలు ఇంత గౌరవిస్తూ ఉంటే, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే భర్తను ఆయన భార్య ఇంకెంత గౌరవిస్తుంది. అంత ప్రాముఖ్యత ఉన్న తన భర్త కు కష్టం వస్తే ఎంత విలవిలలాడిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి దేవికి. ఆమె తన తండ్రిని ఎంత అభిమానించిందో, అవసరం వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువగా తన భర్తకు అండగా ఉంది. తన తండ్రి స్థbhuvaneswari{#}bhuvaneshwari;Nara Bhuvaneshwari;Chakram;Telugu Desam Party;Stree;WOMEN;Father;Husband;marriage;Wife;CBN;Heroజగన్‌ను భువనేశ్వరి కన్నీరు వెంటాడుతుందా?జగన్‌ను భువనేశ్వరి కన్నీరు వెంటాడుతుందా?bhuvaneswari{#}bhuvaneshwari;Nara Bhuvaneshwari;Chakram;Telugu Desam Party;Stree;WOMEN;Father;Husband;marriage;Wife;CBN;HeroFri, 15 Sep 2023 23:00:00 GMTఏ భార్యకైనా తన భర్త ప్రధమ దైవం. స్త్రీ చిన్నతనం నుండి తన తండ్రిని ఎంత ఆరాధిస్తుందో, పెళ్లి అయిన తర్వాత తన భర్తను  అంతకన్నా ఎక్కువ ఆరాధిస్తుంది. సాధారణ భర్తలనే భార్యలు ఇంత గౌరవిస్తూ ఉంటే, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే భర్తను ఆయన భార్య ఇంకెంత గౌరవిస్తుంది. అంత ప్రాముఖ్యత ఉన్న తన భర్త కు కష్టం వస్తే ఎంత విలవిలలాడిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి దేవికి.


ఆమె తన తండ్రిని ఎంత అభిమానించిందో, అవసరం వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువగా తన భర్తకు అండగా ఉంది. తన తండ్రి  స్థాపించిన తెలుగుదేశం పార్టీ కష్టంలో ఉన్నప్పుడు తన భర్త అయితేనే సమర్థవంతంగా నడుపుకు రాగలడని నమ్మింది ఆ సతీమణి. రాష్ట్ర రాజకీయాలను, జాతీయ రాజకీయాలను, లంకంత కుటుంబాన్ని ఒంటి చేత్తో నిర్వహించగల సత్తా తన భర్తకు ఉందని  భువనేశ్వరి దేవికి నమ్మకం.


నందమూరి కుటుంబంలో చిన్నల్లుడుగా ఉన్నా కూడా, బాధ్యతలను అటు రాజకీయ పరంగానూ, కుటుంబ పరంగాను సమర్థవంతంగా నడుపుకు వచ్చిన వ్యక్తి ఆమె భర్త. అందుకే ఆయన అంటే భువనేశ్వరి దేవికి అంత ప్రేమ, నమ్మకం. అయితే ఆమె ఆరాధించే తన భర్త ఇప్పుడు కష్టాల్లో ఉండడం చూసి తట్టుకోలేక పోతుంది ఆమె. చంద్రబాబు నాయుడు జైలుకు  వెళ్లినప్పటి నుంచి ఆమె కన్నీరు మున్నీరు అవుతుందని అంటున్నారు కుటుంబ సభ్యులు.


జీవితంలో ఏ మనిషికి రాకూడని కష్టం భువనేశ్వరి దేవికి వచ్చింది ఇప్పుడు. తన కుటుంబంలోనూ, సమాజంలోనూ, తన జీవితంలో కూడా హీరో అయినటువంటి చంద్రబాబు నాయుడుని అలా చూసి ఆమె తట్టుకోలేక పోతుంది. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఆమె జీవితంలో ఎప్పుడూ పడనటువంటి కష్టాన్ని పడుతుంది ఇప్పుడు. ఆమె తన భర్తను చూడడానికి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళింది. కానీ ఆయనని జైల్లో అలా చూసిన తర్వాత మాత్రం కన్నీటిని ఆపుకోలేక పోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బీడీలు చుట్టే చేతులే.. పిడికిలి బిగించాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>