MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0fdffd84-e261-4c9d-acdc-f93559affe90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0fdffd84-e261-4c9d-acdc-f93559affe90-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నార్త్ సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఆడియన్స్ నే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ మూవీ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మన టాలీవుడ్ తరఫునుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'జవాన్' ని ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేశాడు." జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ తో టీమ్ tollywood{#}Kollywood;Love;Avatar;Varsham;Fidaa;Chitram;Audience;Director;Allu Arjun;Hero;Jawaan;Cinema;Tollywood;media;september'పుష్ప' మూవీని మూడు సార్లు చూసాను - బన్నీ కి షారుక్ రిప్లై!'పుష్ప' మూవీని మూడు సార్లు చూసాను - బన్నీ కి షారుక్ రిప్లై!tollywood{#}Kollywood;Love;Avatar;Varsham;Fidaa;Chitram;Audience;Director;Allu Arjun;Hero;Jawaan;Cinema;Tollywood;media;septemberFri, 15 Sep 2023 12:00:21 GMTహీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నార్త్ సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఆడియన్స్ నే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ మూవీ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మన టాలీవుడ్ తరఫునుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'జవాన్' ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పలు పోస్ట్స్   చేశాడు." జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ తో టీమ్ అందరికీ శుభాకాంక్షలు. సినిమాలో నటీనటులు, టెక్నీషియన్లు, సిబ్బంది, ప్రొడ్యూసర్లు అందరికీ నా అభినందనలు.

 షారుక్ ఖాన్ గారి మాసియస్ట్ అవతార్ ఇది. తన స్వాగ్ తో ఇండియాని, ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్" అని బన్నీ తన సోషల్ మీడియా లో పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్  కి షారుక్ ఖాన్ తాజాగా స్పందించారు." థాంక్యూ సో మచ్ మ్యాన్. స్వాగ్ విషయానికి వస్తే పైరే నన్ను పొగుడుతుంది. వావ్ చాలా సంతోషంగా ఉంది. జవాన్ సక్సెస్ రెట్టింపు అయింది. నేను పుష్ప మూవీ మూడు రోజుల్లో మూడుసార్లు చూశాను. నీ నుంచి నేను నేర్చుకోవాలి. నా నుంచి నీకు పెద్ద హగ్. టైం దొరికినప్పుడు నేరుగా వచ్చి కౌగిలించుకుంటా, కీప్  స్వాగింగ్ లవ్ యూ" అని బన్నీ కి రిప్లై ఇచ్చారు. దీంతో షారుక్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

కాగా 'పుష్ప' సినిమాకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు పుష్ప సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ ఏడాది చివరిలోనే సినిమాను విడుదల చేయాలనుకున్నారు, కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో రిలీజ్ ని వచ్చే ఏడాది ఆగస్టు 15 కి వాయిదా వేశారు. ఇక 'జవాన్' విషయానికి వస్తే.. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి రోజే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టెన్షన్ పెడుతున్న చంద్రముఖి 2 రన్ టైం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>