Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket7b890e46-10ce-4b38-b998-eb1f536fcd71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket7b890e46-10ce-4b38-b998-eb1f536fcd71-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో భాగంగా అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది టీమ్ ఇండియా. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు అంచనాలకు మించి ప్రదర్శన చేస్తూ అదరగొడుతుంది. ఈ క్రమంలోనే ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే ఫైనల్ అడుగుపెట్టిన మొదటి టీం గా కూడా రికార్డ్ సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టు విజయం సాధించడంతో.. ఇక ఫైనల్ లో భారత్ తో శ్రీలంక టీం పోటీ పడబోతుంది అని చెప్పాలి. కానీ అంతకుముందే అటు భారత జట్టు బాంగ్లాదేశ్ తో Cricket{#}Suryakumar Yadav;Ram Gopal Varma;Bangladesh;VIRAT KOHLI;BCCI;Sri Lanka;Cricket;INTERNATIONAL;Telangana;Telugu;Indiaబంగ్లాదేశ్ తో మ్యాచ్.. స్టార్లకు విశ్రాంతి.. తెలుగోడికి ఛాన్స్ వస్తుందా?బంగ్లాదేశ్ తో మ్యాచ్.. స్టార్లకు విశ్రాంతి.. తెలుగోడికి ఛాన్స్ వస్తుందా?Cricket{#}Suryakumar Yadav;Ram Gopal Varma;Bangladesh;VIRAT KOHLI;BCCI;Sri Lanka;Cricket;INTERNATIONAL;Telangana;Telugu;IndiaFri, 15 Sep 2023 08:50:00 GMTప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో భాగంగా అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది టీమ్ ఇండియా. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు అంచనాలకు మించి ప్రదర్శన చేస్తూ అదరగొడుతుంది. ఈ క్రమంలోనే ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే ఫైనల్ అడుగుపెట్టిన మొదటి టీం గా కూడా రికార్డ్ సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టు విజయం సాధించడంతో.. ఇక ఫైనల్ లో భారత్ తో శ్రీలంక టీం పోటీ పడబోతుంది అని చెప్పాలి. కానీ అంతకుముందే అటు భారత జట్టు బాంగ్లాదేశ్ తో నామమాత్రమైన మ్యాచ్ ఆడాల్సి ఉంది.


 అయితే నామమాత్రమైన మ్యాచ్ కావడంతో ఇక టీమిండియా కీలకమైన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి బెంచ్ పై కూర్చోబెట్టిన ఆటగాళ్లను ఇక జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఓడిపోయి ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఇక బాంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్ళకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆసియా కప్ కోసం ఎంపికైన తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ అటు అంతర్జాతీయ వన్డే లోకి మాత్రం అరంగేట్రం చేయలేదు.


 అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా బెంచ్ కి పరిమితం అయ్యాడు ఈ క్రమంలోనే  వర్క్ లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకొని భారత జట్టు మార్పులు చేస్తుంది అన్నది తెలుస్తుంది. అయితే ప్రపంచ కప్ ముందు కూర్పును సరి చూసుకునేందుకు జట్టును అలాగే కొనసాగించే అవకాశం కూడా ఉంది కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అటు బీసీసీఐ సెలెక్టర్లు యంగ్ తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకి బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ లో ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్లాస్ లుక్ లో మెరిసిపోతున్న రెబా మోనికా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>