EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chnadrababuc32a761f-76d9-46e6-8b12-21ace05965a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chnadrababuc32a761f-76d9-46e6-8b12-21ace05965a6-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులకు ఇప్పుడు తమ నాయకుడు కష్టంలో ఉండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పెద్ద కుట్రతోనే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన వ్యూహ రచన వెనుక ఢిల్లీలో ఉన్న పెద్దలు హస్తం కూడా ఉందని వాళ్ళు బలంగా భావిస్తున్నారు. ఇటు జగన్, అటు మోడీ ఇద్దరూ కలిపి ఈ విధంగా చంద్రబాబును అరెస్టు చేయించారని కొంత మంది భావన. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిని జైల్లో పెట్టడం ద్వారా బెయిల్ కూడా త్వరగా రానివ్వకుండా చేయCHNADRABABU{#}rachana;Nara Lokesh;Reddy;Madhya Pradesh - Bhopal;December;Bharatiya Janata Party;Telugu Desam Party;CBNబాబుకు మరో బిగ్‌షాక్‌.. ముందస్తుకు జగన్?బాబుకు మరో బిగ్‌షాక్‌.. ముందస్తుకు జగన్?CHNADRABABU{#}rachana;Nara Lokesh;Reddy;Madhya Pradesh - Bhopal;December;Bharatiya Janata Party;Telugu Desam Party;CBNFri, 15 Sep 2023 08:34:00 GMTతెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులకు ఇప్పుడు తమ నాయకుడు  కష్టంలో ఉండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పెద్ద కుట్రతోనే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన వ్యూహ రచన వెనుక ఢిల్లీలో ఉన్న పెద్దలు  హస్తం కూడా ఉందని వాళ్ళు బలంగా భావిస్తున్నారు. ఇటు జగన్, అటు మోడీ ఇద్దరూ కలిపి ఈ విధంగా చంద్రబాబును అరెస్టు చేయించారని కొంత మంది భావన.


ఈ విధంగా తెలుగుదేశం పార్టీ  నాయకుడిని జైల్లో పెట్టడం ద్వారా  బెయిల్ కూడా త్వరగా రానివ్వకుండా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా తాము ఒంటరిగానే విజయం సాధించేస్తామని వాళ్ళ భావన. ఇంకో విషయం ఏమిటంటే  తమ నాయకుడు జైల్లో ఉన్న కారణంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింద కేడర్ అంతా కూడా నిరసనలో, నిరాహార దీక్షలో చేయడం అయితే జరుగుతుంది.


అప్పుడు వాళ్ళందరినీ జైళ్ళలో  వేయించడం జరుగుతుంది. ఇలా వీళ్లందరినీ కేసులు పెట్టి జైల్లో వేయించి బయటికి రానివ్వకుండా చేస్తారని వాళ్ళు అనుకుంటున్న లెక్క. లేదా కేసులతో బైండోవర్ చేయించి తద్వారా వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయకుండా చేయాలనే కుట్ర కూడా ఉందట.  నవంబర్, డిసెంబర్ లలో రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికలతో కనుక వీళ్లు కూడా కలిసి వెళ్లిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.


అంతే కాకుండా చంద్రబాబు  నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వం వహించేది నారా లోకేష్ . కాబట్టి నారా లోకేష్ ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని వీళ్ళ భావన. ఈ విధంగా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుందని వాళ్లు భావిస్తున్నట్లుగా అనుకుంటున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్న క్రమంలో దానికి బదులుగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పావులు కదపడానికి పన్నాగాలు వేస్తుందని అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్లాస్ లుక్ లో మెరిసిపోతున్న రెబా మోనికా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>