Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chahal2a1dfc7d-f9d5-4037-bb78-37e20f1afdf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chahal2a1dfc7d-f9d5-4037-bb78-37e20f1afdf3-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి భారత స్టార్ స్పిన్నర్ చాహల్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతు ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడు భారత జట్టులో రెగ్యులర్ గా కనిపించే ఈ స్పిన్నర్.. ఇటీవల భారత్ ఆడుతున్న కీలకమైన ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. దీంతో చాహల్ లాంటి ఆటగాడు విషయంలో సెలెక్టర్లు వివక్ష చూపుతున్నారు అంటూ అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇక ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకో లేకపోయినా చాహల్ ఇంగ్లాండ్ కౌంటిలలో మొట్టమొదటిసారి అడుగు పెట్టాడChahal{#}England;twitter;World Cup;96;James Cameron;Indiaటీమిండియా వద్దంది.. కానీ అక్కడ తన సత్తా ఏంటో చూపించాడు?టీమిండియా వద్దంది.. కానీ అక్కడ తన సత్తా ఏంటో చూపించాడు?Chahal{#}England;twitter;World Cup;96;James Cameron;IndiaThu, 14 Sep 2023 07:22:00 GMTగత కొంతకాలం నుంచి భారత స్టార్ స్పిన్నర్  చాహల్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతు ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడు భారత జట్టులో రెగ్యులర్ గా కనిపించే ఈ స్పిన్నర్.. ఇటీవల భారత్ ఆడుతున్న కీలకమైన ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. దీంతో చాహల్ లాంటి ఆటగాడు విషయంలో సెలెక్టర్లు వివక్ష చూపుతున్నారు అంటూ అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇక ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకో లేకపోయినా  చాహల్ ఇంగ్లాండ్ కౌంటిలలో మొట్టమొదటిసారి అడుగు పెట్టాడు అన్న విషయం తెలిసిందే.


 కెంట్ జట్టు తరఫున తొలిసారి కౌంటి క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అయితే భారత జట్టులో చోటుకు నోచుకోలేకపోయిన చాహల్ అటు కౌంటి క్రికెట్లో మాత్రం తన స్పిన్ సత్తా ఏంటో చూపించాడు. ఇటీవల నాటింగ్ హామ్ తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి తనను వద్దన్న వారికి సరైన సమాధానమే చెప్పాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన మ్యాచ్లో 29 ఓవర్లు వేసిన చాహల్.. ఇక మూడు వికెట్లు తీయడమే కాదు.. 10 మేడిన్ ఓవర్లు కూడా వేయడం గమనార్హం. ఇక తన స్పెల్ లో 63 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే చాహల్ తన స్పిన్ బౌలింగ్ తో  లిండన్ జేమ్స్ ని క్లీన్ బౌల్డ్ చేసిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.


 ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలిత బ్యాటింగ్ చేసిన కెంట్ పది వికెట్లు కోల్పోయి.. 446 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నాటింగ్ హామ్ జట్టు 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో అటు కెంట్ జట్టుకి భారీ ఆదిక్యం లభించింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్న చాహల్.. టీమిండియా  తరఫున వన్డే ఫార్మాట్లో 72 మ్యాచ్ లలో 5.27  ఎకానమీతో 121 వికెట్లు పడగొట్టాడు  ఇక టి20 ఫార్మాట్లో 80 మ్యాచ్లలో 96 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయినప్పటికీ అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>