DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kishan-reddy4f7d4b43-a517-4bdd-afbf-13e527310262-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kishan-reddy4f7d4b43-a517-4bdd-afbf-13e527310262-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన పోలీసులు భగ్నం చేసిన సమయంలో భారీగా తోపులాట జరిగింది. దీంతో కిషన్ రెడ్డికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆయన ఒంటిపై పలుచోట్ల గోరు గాట్ల పడ్డాయి. ఛాతీకి కూడా గాయమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కిషన్ రెడ్డికి ఫోన్‌ చేశారు. పోరాటం కొనసాగించాలని తమ మద్దతు ఉంటుందని తెలిపారు. నిన్న సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి రీత్యా దీక్ష విరమించాలని పోలీసులు కిషన్ రెడ్డికి సూచించారు. సాయంత్రం 6: 30సమయంలో పోలీసులు హెచ్చరించిన లెక్క చేయకKISHAN REDDY{#}Indira Gandhi;G Kishan Reddy;thursday;Arrest;Evening;Traffic police;police;Party;central government;Bharatiya Janata Partyకిషన్‌ రెడ్డికి గాయాలు.. అమిత్‌షా ఫోన్‌?కిషన్‌ రెడ్డికి గాయాలు.. అమిత్‌షా ఫోన్‌?KISHAN REDDY{#}Indira Gandhi;G Kishan Reddy;thursday;Arrest;Evening;Traffic police;police;Party;central government;Bharatiya Janata PartyThu, 14 Sep 2023 09:00:00 GMTకేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన పోలీసులు భగ్నం చేసిన సమయంలో భారీగా తోపులాట జరిగింది. దీంతో కిషన్ రెడ్డికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆయన ఒంటిపై పలుచోట్ల గోరు గాట్ల పడ్డాయి. ఛాతీకి కూడా గాయమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కిషన్ రెడ్డికి ఫోన్‌ చేశారు. పోరాటం కొనసాగించాలని తమ మద్దతు ఉంటుందని తెలిపారు.


నిన్న సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి రీత్యా దీక్ష విరమించాలని పోలీసులు కిషన్ రెడ్డికి సూచించారు. సాయంత్రం 6: 30సమయంలో పోలీసులు హెచ్చరించిన లెక్క చేయకుండా కిషన్ రెడ్డి దీక్షను కొనసాగించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక్కసారిగా పోలీసులు భారీగా మోహరించారు. కిషన్ రెడ్డితో పాటు దీక్ష చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసేందుకు యత్నించడంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటచేసుకుంది.


ఈ తోపులాటతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముందుగా ప్రకటించినట్లుగానే గురువారం ఉదయం పదకొండు గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని కిషన్ రెడ్డి  ప్రశ్నించారు. ఎట్టకేలకు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోకీ ఎక్కించారు. కిషన్ రెడ్డిని ఎక్కించిన పోలీసు వాహనంపైకి బీజేపీ కార్యకర్తలు ఎక్కారు. మరికొంత మంది వాహనం ముందు కూర్చొని కదలకుండా అడ్డుకున్నారు.


పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులను చెదరగొట్టి కిషన్ రెడ్డిని తీసుకెళ్లారు.  ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు భాజపా కార్యకర్తలు కింద పడటంతో గాయ పడ్డారు. కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. పార్టీ రాష్ట్ర కార్యాయంలోనే కిషన్ రెడ్డి నిరాహార దీక్షను కొనసాగించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>