Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral6565a411-f2eb-403a-b230-6b125d43ee6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral6565a411-f2eb-403a-b230-6b125d43ee6f-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయిన మనిషి ఇక అన్ని పనులను సులభతరం చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏది కావాలన్నా కూర్చున్న చోటుకే తెప్పించుకోగలుగుతున్నాడు మనిషి. ఇక తినే ఆహారం విషయంలో కూడా ఇదే ధోరణితో ఉన్నాడు. ఇక ప్రస్తుతం తమ కస్టమర్లకు కావాల్సిన ఆహారాన్ని ఇంటి ముందుకే డెలివరీ చేసేందుకు ఎన్నో కంపెనీలు కూడా అందుబాటులో ఉన్నాయి. పోటీపడి మరి డెలివరీ చేస్తున్నాయ్. అత్యంత వేగంగా మేమే డెలివరీ చేస్తున్నాం అంటూ ప్రకటనలు కూడా చేసుకుంటున్నాయి. దీంతో ఇలాంటి డెలివరీ సదుపాయాలను ఉViral{#}advertisement;Customerపార్సిల్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్.. యాక్.. వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే?పార్సిల్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్.. యాక్.. వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే?Viral{#}advertisement;CustomerThu, 14 Sep 2023 07:30:00 GMTఇటీవల కాలంలో టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయిన మనిషి ఇక అన్ని పనులను సులభతరం చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏది కావాలన్నా కూర్చున్న చోటుకే తెప్పించుకోగలుగుతున్నాడు మనిషి. ఇక తినే ఆహారం విషయంలో కూడా ఇదే ధోరణితో ఉన్నాడు. ఇక ప్రస్తుతం తమ కస్టమర్లకు కావాల్సిన ఆహారాన్ని ఇంటి ముందుకే డెలివరీ చేసేందుకు ఎన్నో కంపెనీలు కూడా అందుబాటులో ఉన్నాయి. పోటీపడి మరి డెలివరీ చేస్తున్నాయ్. అత్యంత వేగంగా మేమే డెలివరీ చేస్తున్నాం అంటూ ప్రకటనలు కూడా చేసుకుంటున్నాయి.


 దీంతో ఇలాంటి డెలివరీ సదుపాయాలను ఉపయోగించుకుంటున్న ఎంతోమంది ఇక తమకు కావాల్సిన ఆహారాన్ని ఎక్కడికో హోటల్కు వెల్లి తెచ్చుకోవడం కాదు అదే హోటల్ నుంచి ఇంటికి తెప్పించుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆర్డర్లు చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు డెలివరీ బాయ్ మాత్రం చిత్రవిచిత్రంగా  ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఏకంగా కొంతమంది కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ని మధ్యలోనే ఖాళీ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా వీడియోలు ఇప్పటివరకు చాలానే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.  ఇక్కడ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పని మాత్రం జుగుప్సాకారంగా ఉంది అని చెప్పాలి.

 పార్సిల్ తీసుకొచ్చి ఇంటి తలుపు ముందు పెట్టిన డెలివరీ బాయ్.. వెళ్తూ వెళ్తూ చేసిన పనితో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఫ్లోరిడాకు చెందిన ఒక మహిళ 13 ఏళ్ల కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. ఇటీవల తన కొడుకుకు నచ్చిన ఫుడ్ ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. అయితే ఇలా ఆర్డర్ పెట్టిన దానికి ఏకంగా టిప్ కూడా ఇచ్చింది మహిళ. అయితే ఆర్డర్ ను తీసుకొచ్చిన వ్యక్తి ఇక ఆ పార్సిల్ను కస్టమర్ ఇంటి డోర్ వద్ద పెట్టి సైలెంట్ గా వెళ్ళిపోకుండా.. ఏకంగా ఆ పార్సెల్ పై ఉమ్మి వేశాడు. ఇంత తక్కువ టిప్ ఇస్తారా అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>