Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wanrer604ee85c-b526-469f-bb80-979d238b8dae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wanrer604ee85c-b526-469f-bb80-979d238b8dae-415x250-IndiaHerald.jpgఫన్నీ గేమ్ గా పిలుచుకునే క్రికెట్లో కొన్ని కొన్ని సార్లు ఆసక్తికర ఘటనలు జరుగుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. కొన్నిసార్లు ప్రేక్షకులు అందరిని నవ్వించే ఘటనలు జరిగితే ఇంకొన్నిసార్లు అందరిని ఆశ్చర్యపరిచే ఘటనలు అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఆటగాళ్లు అనూహ్యమైన రీతిలో రన్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి జరిగాయి అంటే చాలు పాపం ఆ ఆటగాడు దురదృష్టం అంటే ఇదేనేమో అని భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు జరిగిన విషయంWanrer{#}bhavana;Australia;GEUM;Audienceపాపం డేవిడ్ వార్నర్.. షూ వల్ల అవుట్ అయ్యాడు?పాపం డేవిడ్ వార్నర్.. షూ వల్ల అవుట్ అయ్యాడు?Wanrer{#}bhavana;Australia;GEUM;AudienceThu, 14 Sep 2023 09:00:00 GMTఫన్నీ గేమ్ గా పిలుచుకునే క్రికెట్లో కొన్ని కొన్ని సార్లు ఆసక్తికర ఘటనలు జరుగుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. కొన్నిసార్లు ప్రేక్షకులు అందరిని నవ్వించే ఘటనలు జరిగితే ఇంకొన్నిసార్లు అందరిని ఆశ్చర్యపరిచే ఘటనలు అప్పుడప్పుడు తెరమీదికి   వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఆటగాళ్లు అనూహ్యమైన  రీతిలో రన్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి జరిగాయి అంటే చాలు పాపం ఆ ఆటగాడు దురదృష్టం అంటే ఇదేనేమో అని భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు జరిగిన విషయం తెలిసి అందరూ ఇదే అనుకుంటున్నారు.


 ప్రస్తుతం ఆస్ట్రేలియా టీం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ ఐదు మ్యాచ్లలో వన్డే సిరీస్ ఆడుతుంది  ఇక ఇప్పటికే రెండు మ్యాచ్ లలో వరసగా విజయాలు సాధించింది. ఇక ఇటీవల మూడో వన్డే మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. దీంతో మొదటి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 34.3 ఓవర్లలో 227 పరుగులతో అన్ని వికెట్లు కోల్పోయి పరాజయం పాలయింది. ఇక దక్షిణాఫ్రికా 111 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.


 అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అవుట్ అయిన తీరు మాత్రం సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఏకంగా 78 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. 56 బంతుల్లోనే 78 పరుగులు సాధించగా.. ఇందులో 10 ఫోర్లు మూడు సిక్సర్లు  ఉన్నాయి. అయితే అతను షూ కారణంగా అవుట్ అయ్యాడు అని చెప్పాలి. ఏకంగా అతని షూ మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో సరైన సమయానికి తన కాలిని క్రీజ్ లో పెట్టలేకపోయాడు. చివరికి ప్రత్యర్ధులు ఇది గమనించి అతని రన్ అవుట్ చేశారు. దీని గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>