Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/creativtifcc004d6-86e1-4f54-9211-dd38a87a785e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/creativtifcc004d6-86e1-4f54-9211-dd38a87a785e-415x250-IndiaHerald.jpgమనలో క్రియేటివిటీ ఉండాలే కానీ చదువుతో వయస్సుతో అస్సలు సంబంధం లేదు. ఏదైనా చేసేయొచ్చు అని నిరూపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా సరికొత్త కనుగొనాలి అంటే కేవలం శాస్త్రవేత్తలకు మాత్రమే సాధ్యమవుతుంది అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో సామాన్యులు సైతం క్రియేటివ్ గా ఆలోచిస్తూ వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. జీవితం అందరికీ అన్ని నేర్పిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇలా జీవితం నేర్పించిన పాఠాలనే నేర్చుకుంటూ ఇక తమ అవసరాలను తీర్చుకోవCreativti{#}Chiranjeevi;mandalam;Bike;Cycle;Siddipetఈ తాత క్రియేటివిటీకి నేటి యువత ఫిదా.. ఇంజనీర్లు కూడా దిగదుడుపే?ఈ తాత క్రియేటివిటీకి నేటి యువత ఫిదా.. ఇంజనీర్లు కూడా దిగదుడుపే?Creativti{#}Chiranjeevi;mandalam;Bike;Cycle;SiddipetThu, 14 Sep 2023 07:50:00 GMTమనలో క్రియేటివిటీ ఉండాలే కానీ చదువుతో వయస్సుతో అస్సలు సంబంధం లేదు. ఏదైనా చేసేయొచ్చు అని నిరూపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా సరికొత్త కనుగొనాలి అంటే కేవలం శాస్త్రవేత్తలకు మాత్రమే సాధ్యమవుతుంది అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో సామాన్యులు సైతం క్రియేటివ్ గా ఆలోచిస్తూ వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు.


 జీవితం అందరికీ అన్ని నేర్పిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇలా జీవితం నేర్పించిన పాఠాలనే నేర్చుకుంటూ ఇక తమ అవసరాలను తీర్చుకోవడానికి వినూత్నమైన ఆవిష్కరణలు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఏకంగా ముసలి వాళ్లు సైతం ఇటీవల కాలంలో తమ క్రియేటివిటీకి కాస్త సాన పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కూడా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏకంగా సైకిల్ ని మోటార్ సైకిల్ గా మార్చుకున్నాడు. ఇక అతని టాలెంట్ చూసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.



 అతనికి ఇది ఎలా సాధ్యమైంది అని నేటి యువత కూడా ఆశ్చర్యంలో  మునిగిపోతున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం హబీపూర్ గ్రామానికి చెందిన చంద్రం అని 60 ఏళ్ల వృద్ధుడికి ఒక సైకిల్ ఉంది. అయితే సైకిల్ పై ఊరురా తిరుగుతూ చిన్న పిల్లలకు సంబంధించిన కురుకురే  బింగో లాంటి తినుబండారాలను కిరాణా షాపులకు విక్రయిస్తూ ఉంటాడు ఈ చిరు వ్యాపారి. అయితే గత 30 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం వయసు మీద పడటంతో సైకిల్ తొక్కడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. అదే సమయంలో ఇక బైక్ కొనేందుకు అతని దగ్గర ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఒక తెలివైన ఉపాయాన్ని కనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక తన దగ్గర ఉన్న సైకిల్ ని బ్యాటరీ సైకిల్ గా మార్చేసాడు. 22 వేల రూపాయలతో బ్యాటరీ సైకిల్ తయారు చేసాడు. దీన్ని ఒకసారి చాట్ చేస్తే 60 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ సైకిల్ పై ఊరురా తిరుగుతూ ఎప్పటిలాగే తన పని చేసుకుంటున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>