PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan4a3cb7ad-7b7a-4584-9ca4-4ea5c8591e26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan4a3cb7ad-7b7a-4584-9ca4-4ea5c8591e26-415x250-IndiaHerald.jpgఅలాగే బాబాయ్ వివేకానంరెడ్డిని హత్యచేసి, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేసిన వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారంటు మండిపోయారు. కోర్టులు పనిచేయటం లేదుకాబట్టి వివేకా హంతకులు బయట తిరుగుతున్నారు అని కామెంట్ చేశారు. వివేకా ను జగనే హత్యచేశాడు లేదా చేయించాడని డైరెక్టుగా చెప్పటానికి పవన్ కు ధైర్యం సరిపోలేదు. పవన్ బాధంతా ఏమిటంటే ఎలాంటి తప్పు చేయని చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందట. జగన్ కక్షసాధింపులకు, రాక్షస పాలనకు చంద్రబాబు లాంటి విజనరీ ఇబ్బందులు పడుతున్నట్లు పవన్ చెప్పారు. chandrababu pawan{#}Murder;Mangalagiri;Murder.;CBN;Jagan;court;Pawan Kalyan;Telangana Chief Ministerఅమరావతి : పవన్ బాధ మామూలుగా లేదుగాఅమరావతి : పవన్ బాధ మామూలుగా లేదుగాchandrababu pawan{#}Murder;Mangalagiri;Murder.;CBN;Jagan;court;Pawan Kalyan;Telangana Chief MinisterThu, 14 Sep 2023 03:00:00 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ మామూలుగా లేదు. మంగళగిరి పార్టీ ఆఫీసులో నేతల సమావేశంలో మాట్లాడినపుడు పవన్ మొహం బాగా వాడిపోయి, వాచిపోయినట్లుంది. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించినందుకు పవన్ భోరుమని ఏడ్చినట్లున్నారు. అందుకనే మొహం వాచిపోయినట్లు కనిపిస్తోంది. నేతలతో మాట్లాడినపుడు పవన్ చెప్పిందేమంటే దేశంలో చట్టాలు, న్యాయస్ధానాలు సరిగా పనిచేయటంలేదట. జగన్మోహన్ రెడ్డిని ఉదహరిస్తు దేశంలో న్యాయస్ధానాలు, చట్టాలు పనిచేయటంలేదని తేల్చేశారు.



ఇంతకీ పవన్ బాధఏమిటంటే వేల కోట్లరూపాయలను దోచుకున్న జగన్ హ్యాపీగా ముఖ్యమంత్రి అయ్యారట. నిజంగానే చట్టాలు, న్యాయస్ధానాలు పనిచేస్తుంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడేనా అని ప్రశ్నించాడు. చట్టాలు, కోర్టులు సక్రమంగా పనిచేస్తుంటే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని పవన్ తేల్చేశాడు. వేల కోట్లరూపాయలు దోచుకున్న జగన్ ముఖ్యమంత్రి అవటం ఇంకెక్కడైనా సాధ్యమవుతుందా అన్నారు.



అలాగే బాబాయ్ వివేకానంరెడ్డిని హత్యచేసి, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేసిన వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారంటు మండిపోయారు. కోర్టులు పనిచేయటం లేదుకాబట్టి వివేకా హంతకులు బయట తిరుగుతున్నారు అని కామెంట్ చేశారు. వివేకా ను జగనే హత్యచేశాడు లేదా చేయించాడని డైరెక్టుగా చెప్పటానికి పవన్ కు ధైర్యం సరిపోలేదు. పవన్ బాధంతా ఏమిటంటే ఎలాంటి తప్పు చేయని చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందట. జగన్ కక్షసాధింపులకు, రాక్షస పాలనకు చంద్రబాబు లాంటి విజనరీ ఇబ్బందులు పడుతున్నట్లు పవన్ చెప్పారు.



చంద్రబాబు మీద జగన్ కక్షసాధింపులకు పాల్పడితే ఇంకేమైనా కేసు పెట్టేవారు కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కేసు ఎలా పెట్టగలరు ? అనే ఇంగితం పవన్లో లోపించింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది, స్కామ్ చేసింది చంద్రబాబే అన్నవిషయాన్ని అంగీకరించటానికి పవన్ ఇష్టపడటంలేదు. చంద్రబాబు అరెస్టు అక్రమంగా జరిగిందని అనుకున్నా మరి కోర్టు రిమాండ్ ఎలా విధించింది ? చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ చూపించిన ఆధారాలతో ఏకీభవించిన తర్వాతే కదా కోర్టు రిమాండ్ విధించిందనే ఆలోచన కూడా పవన్లో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోదావరి : చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>