MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dile-se-trailerb6eb6574-3dfd-4f2c-be8d-9e1e9a349f96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dile-se-trailerb6eb6574-3dfd-4f2c-be8d-9e1e9a349f96-415x250-IndiaHerald.jpgఈమధ్య తెలుగులో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగింది. స్వయంగా మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్ లను రూపొందిస్తూ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగు నుంచి వచ్చిన ఏటీఎం, దయా, సైతాన్ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా తెలుగులో మరో వెబ్ సిరీస్ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఈటీవీ విన్' 'దిల్ సే' పేరుతో ఓ సరికొత్త వెబ్ సిరీస్ ను రూపొందించింది. అర్బన్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో చాయ్ బిస్కెట్ ఫెమ్Dile Se Trailer{#}ajay;bharath;prema;rahul;raja;ramana;sridhar;Sri Bharath;Rahul Sipligunj;Allari;Girl;raj;sree;Parents;Love;kiran;krishna;anoushka;september;job;Hero;Tollywood;Heroine;Telugu;Corporateఆకట్టుకుంటున్న 'దిల్ సే' వెబ్ సిరీస్ ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?ఆకట్టుకుంటున్న 'దిల్ సే' వెబ్ సిరీస్ ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?Dile Se Trailer{#}ajay;bharath;prema;rahul;raja;ramana;sridhar;Sri Bharath;Rahul Sipligunj;Allari;Girl;raj;sree;Parents;Love;kiran;krishna;anoushka;september;job;Hero;Tollywood;Heroine;Telugu;CorporateThu, 14 Sep 2023 10:10:00 GMTఈమధ్య తెలుగులో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగింది. స్వయంగా మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్ లను రూపొందిస్తూ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగు నుంచి వచ్చిన ఏటీఎం, దయా, సైతాన్ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా తెలుగులో మరో వెబ్ సిరీస్ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఈటీవీ విన్' 'దిల్ సే' పేరుతో ఓ సరికొత్త వెబ్ సిరీస్ ను రూపొందించింది. అర్బన్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో చాయ్ బిస్కెట్ ఫెమ్ రాజా విక్రమ్, వర్షా హీరో, హీరోయిన్స్ గా నటించారు. భార్గవ్, రోహిణీ రావ్, రాహుల్ వర్మ, రమణ భార్గవ, వీవీ కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 16 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా నేడు(సెప్టెంబర్ 13) 'దిల్ సే' ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇక ట్రైలర్ను పరిశీలిస్తే.. ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్ళిన హర్ష (రాజా విక్రమ్) పెద్ద సిటీలో ఎలా ఉంటాడోనని వాళ్ల తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే సమయంలో ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరి సిటీ కల్చర్కు బాగా అలవాటు పడతాడు. స్నేహితులతో కలిసి మందు తాగడం, అల్లరి చేయడం లాంటివి చేస్తాడు. 

అలాగే ఆఫీసులో ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం కూడా నడుపుతాడు. ఇక ఆ అమ్మాయి హర్ష తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అయితే ట్రైలర్ లో ఆ అమ్మాయి ఫేస్ చూపించకుండా మాస్క్ ధరిస్తుంది. ఆ మాస్క్ ను ఎలాగైనా తీయించి ఆ అమ్మాయి ఫేస్ ని చూడాలని హీరో పడే పాట్లు నవ్వులు పూయించే విధంగా ఉన్నాయి. ఇక  చివరలో కొన్ని ఎమోషన్ సీన్స్ తో ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. భరత్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్నట్లు తెలుస్తోంది.  శ్రీ అక్కియాన్ మారిసా పతాకంపై శ్రీధర్ మారిసా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించగా.. రాజ్ మేడ, కిరణ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అనుష్క కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజయ్ అరసాడ స్వరాలు సమకూర్చారు. 




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>