PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balayya-tdp-chandrababu04ed94ac-82b9-4930-9a2f-22ac90c26db1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balayya-tdp-chandrababu04ed94ac-82b9-4930-9a2f-22ac90c26db1-415x250-IndiaHerald.jpgచంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా లోకేష్ కూడా రాజమండ్రిలోనే క్యాంపు వేశారు. చంద్రబాబు బెయిల్ కోసం లాయర్లతో మాట్లాడుతున్నారు. ఇందుకోసమే యువగళం పాదయాత్రను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసుకున్నారు. తను ఫుల్ బిజీగా ఉన్నకారణంగా పార్టీ మీద పూర్తి దృష్టిపెట్టే అవకాశంలేదు. పైగా చంద్రబాబు అరెస్టయిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో లోకేష్ పాత్రపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. దాంతో లోకేష్ అరెస్టు కూడా తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. balayya tdp chandrababu{#}Rajahmundry;Jr NTR;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;MLA;CBN;Partyఅమరావతి : బాలయ్య చేతిలోకి తీసేసుకున్నారా ?అమరావతి : బాలయ్య చేతిలోకి తీసేసుకున్నారా ?balayya tdp chandrababu{#}Rajahmundry;Jr NTR;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;MLA;CBN;PartyThu, 14 Sep 2023 07:00:00 GMT
తెలుగుదేశంపార్టీ పగ్గాలు మళ్ళీ నందమూరి వారసుల చేతికి వస్తుందా ? అనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలే. పార్టీ నేతలతో బాలయ్య మాట్లాడుతు తాను పార్టీని ముందుండి నడిపిస్తానన్నారు. పార్టీకి ఇలాంటి సంక్షోభాలు కొత్తేమీకాదని చెప్పారు. జనాలందరు చంద్రబాబునాయుడుకు మద్దతుగా చేతులు కలిపి రోడ్లపైకి రావాలని పిలుపిచ్చారు. పార్టీ నేతలతో సమీక్షించటం, తర్వాత మీడియాతో మాట్లాడినపుడు కూడా పార్టీకి తానే నాయకత్వం వహిస్తానని అర్ధమొచ్చేట్లుగా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు.

 

దాంతో బాలయ్య ప్రకటన పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే పార్టీ పగ్గాలు ‘నారా’ చేతిలో నుండి ‘నందమూరి’ చేతికి రావాలని చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో కూడా ఇలాంటి డిమాండ్లతోనే పెద్దపెద్ద పోస్టర్లు, హోర్డిండులు వెలుస్తున్నాయి. తాజా పరిణామాలను చూస్తే చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ విధించటంతో పార్టీకి దిశానిర్దేశం చేసే పరిస్ధితిలేదు.



చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా లోకేష్ కూడా రాజమండ్రిలోనే క్యాంపు వేశారు. చంద్రబాబు బెయిల్ కోసం లాయర్లతో మాట్లాడుతున్నారు. ఇందుకోసమే యువగళం పాదయాత్రను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసుకున్నారు. తను ఫుల్ బిజీగా ఉన్నకారణంగా పార్టీ మీద పూర్తి దృష్టిపెట్టే అవకాశంలేదు. పైగా చంద్రబాబు  అరెస్టయిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో లోకేష్ పాత్రపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. దాంతో లోకేష్ అరెస్టు కూడా తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది.



తండ్రి, కొడుకులిద్దరు అరెస్టయితే పార్టీని నడిపేవాళ్ళుండరు. అందుకనే బాలయ్య నేతలతో సమీక్ష చేస్తు పార్టీని ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. బాలయ్య ఎలా నడిపిస్తారన్నది వేరే సంగతి. తాత్కాలికంగా అయినా పార్టీని నడిపించే అవకాశం నందమూరి బాలయ్యకు వచ్చిందనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. ఆమధ్య సీనియర్ ఎంఎల్ఏ గోరంట్ల  బుచ్చయ్యచౌదరి మాట్లాడుతు పార్టీలోకి జూనియర్ ఎన్టీయార్ ను ఆహ్వానించాలని బహిరంగంగా చేసిన డిమాండ్ సంచలనమైన విషయం తెలిసిందే. అంటే పార్టీ పగ్గాలు మళ్ళీ నందమూరి వారసుల చేతిలోకి రావాలనే కోరిక అభిమానుల్లో ఎంత బలంగా ఉందో అర్ధమవుతోంది. కేసుల గోలనుండి చంద్రబాబు, లోకేష్ బయటపడేంతవరకు బాలయ్యే పార్టీని నడుపుతారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విమానంలో టాయిలెట్లోకి వెళ్లిన ప్రేమ జంట.. ఏం చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>