MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7b46dd27-40b0-4da0-aee2-d59fe173f0ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7b46dd27-40b0-4da0-aee2-d59fe173f0ab-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా గుంటూరు కారం. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఏవో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చాలా రకాల ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు గుంటూరు కారం సినిమా పైన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా ఈడాది విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కూడా వాయిదా పడింది. ఎలాగైనా సరే ఈ సినిమాని వచ్చే ఈడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు tollywood{#}thaman s;choudary actor;sree;media;Heroine;News;mahesh babu;trivikram srinivas;Guntur;Cinema;Mass;Indiaగుంటూరు కారం కోసం మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!?గుంటూరు కారం కోసం మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}thaman s;choudary actor;sree;media;Heroine;News;mahesh babu;trivikram srinivas;Guntur;Cinema;Mass;IndiaWed, 13 Sep 2023 20:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా గుంటూరు కారం. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఏవో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చాలా రకాల ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు గుంటూరు కారం సినిమా పైన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా ఈడాది విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కూడా వాయిదా పడింది. ఎలాగైనా సరే ఈ సినిమాని వచ్చే ఈడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపుగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా శ్రీ లీలా నటిస్తుండగా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి సైతం నటిస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ బాబు మాస్ హీరోగా ఈ సినిమాలో ఆయన మాస్ యాంగిల్ లో  కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్లను చూస్తేనే అర్థమవుతుంది.

ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా కోసం దాదాపుగా మహేష్ బాబు 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. మొత్తం ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కాకపోయినప్పటికీ భారీ మొత్తంలో ఖర్చు చేసే మరీ ఈ సినిమాని తీస్తున్నారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు గాలం వేస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>