Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpacfc8659c-4f63-4fd1-bb73-24861e0193ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpacfc8659c-4f63-4fd1-bb73-24861e0193ee-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం "పుష్ప". ఈ చిత్రం మొదటి భాగం "పుష్ప: ది రైస్" 2021 విడుదలయ్యి, ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఈ చిత్రం రెండో భాగం "పుష్ప: ది రూల్" ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు మేకర్స్. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ చేతిని చూపిస్తూ, అతని చేతి చిటికెనువేలు గోరుని హైలైట్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రPushpa{#}chitti babu;Chitram;Manam;sukumar;Hero;rashmika mandanna;Allu Arjun;August;Posters;Cinemaవేలి గోరు వెనక ఇంత కథ ఉందా.. సుకుమార్ మామూలోడు కాదు బయ్యా?వేలి గోరు వెనక ఇంత కథ ఉందా.. సుకుమార్ మామూలోడు కాదు బయ్యా?Pushpa{#}chitti babu;Chitram;Manam;sukumar;Hero;rashmika mandanna;Allu Arjun;August;Posters;CinemaWed, 13 Sep 2023 15:45:00 GMTసుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం "పుష్ప". ఈ చిత్రం మొదటి భాగం "పుష్ప: ది రైస్" 2021 విడుదలయ్యి, ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఈ చిత్రం రెండో భాగం "పుష్ప: ది రూల్" ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు మేకర్స్. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ చేతిని చూపిస్తూ, అతని చేతి చిటికెనువేలు గోరుని హైలైట్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం "వేర్ ఇస్ పుష్ప" పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ వీడియోలో కూడా అదే గోరుని హైలైట్ చేసారు. కానీ అప్పుడు దాని గురించి ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ పోస్టర్ వచ్చాక సోషల్ మీడియాలో దీనిగురించి చర్చ మొదలయింది.

ఇలా పుష్ప చేతి చిటికెనువేలు గోరుని హైలైట్ చెయ్యడం వెనుక ఒక కారణం ఉందని అంటున్నారు. అదేంటంటే, కొన్ని సంస్కృతులలో తమ సంపదను, సమాజంలో తమ స్థాయిని చూపించుకోవడానికి చిటికెనువేలు గోరుని పెంచుతారట. ఇది తమ కీర్తికి, ప్రతిష్టకి గుర్తు అని భావిస్తారట. తాము కేవలం రూల్ చెయ్యడానికే ఉన్నామని చూపించేందుకు చిహ్నమట ఆ గోరు. పుష్ప చిత్రంలో హీరో యెర్ర చందనం వ్యాపారం మొత్తం తన చిటికెనువేలు పై నిలబెట్టి నడిపించగలడని సూచిస్తుందట ఆ గోరు. అందుకే దాన్ని హైలైట్ చేస్తున్నారట మేకర్స్. సుకుమార్ తీసే ప్రతి సీన్ లోను కొన్ని రిఫరెన్స్ లు ఉంటాయి. ఐతే అవి మనం కనిపెట్టడం అంత సులభం కాదు. అవి ఆయన చెప్తేనే తెలుస్తుంది. అతను గతంలో తెరకెక్కించిన "రంగస్థలం" చిత్రంలో కూడా విలన్ జపతిబాబు కి పాముని రిఫరెన్స్ గా చూపించారు. పాముని ఎలాగైతే కొట్టి కొట్టి చంపుతామో, అలాగే ఫనీంద్ర భూపతి ని కూడా చిట్టి బాబు క్లైమాక్స్ లో కర్రతో కొట్టి కొట్టి చంపుతాడు. మరి ఇప్పుడు ఈ గోరుని హైలైట్ చెయ్యడం వెనుక సుకుమార్ ఉద్దేశం ఏమిటో వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>