PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-luthra-ponnavolu067bba83-d959-469d-96e0-b75890dd42e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-luthra-ponnavolu067bba83-d959-469d-96e0-b75890dd42e9-415x250-IndiaHerald.jpgఅదే పద్దతిని సోమవారం కూడా కంటిన్యుచేశారు. సోమవారం వేసిన పిటీషన్ ఏమిటంటే చంద్రబాబుకు రిమాండ్ విధించి జైలులో ఉంచటం కాదు హౌస్ అరెస్టులో ఉండేట్లుగా ఆదేశాలు ఇవ్వాలని వాదించారు. సరే లూథ్రా వాదనలకు వ్యతిరేకంగా సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును రాజమండ్రి జైలులో కాకుండా ఇంట్లో ఎందుకు ఉంచాలి ? అందుకు లూథ్రా చెప్పిన కారణాలు మరీ పేలవంగా ఉన్నాయి. chandrababu luthra ponnavolu{#}Anti-Corruption Bureau;sunday;Rajahmundry;House;monday;CBN;Governmentఅమరావతి : మరీ ఇంత డొల్ల వాదనలా ?అమరావతి : మరీ ఇంత డొల్ల వాదనలా ?chandrababu luthra ponnavolu{#}Anti-Corruption Bureau;sunday;Rajahmundry;House;monday;CBN;GovernmentWed, 13 Sep 2023 09:00:00 GMT



దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్, ప్రముఖ లాయర్లలో ఒకళ్ళైన సిద్దార్ధ లూథ్రా చంద్రబాబునాయుడు తరపున వాదనలు వినిపిస్తున్నారంటే అందరు అబ్బో ఇంకేముంది చద్రబాబు సేఫే అని అనుకున్నారు. కానీ వాదనలు వినిపించటం మొదలైన తర్వాత చూస్తే లూథ్రా వాదనలు  మరీ డొల్లగా ఉన్నాయా అనిపించింది. చంద్రబాబు అరెస్టు విషయంలో ఆదివారం ఎంత పేలవంగా వాదనలు వినించారో అందరు చూసిందే. లూథ్రా వాదనలను ఏసీబీ జడ్జి కొట్టిపారే 14 రోజుల రిమాండ్ విధించారు.





అదే పద్దతిని సోమవారం కూడా కంటిన్యుచేశారు. సోమవారం వేసిన పిటీషన్ ఏమిటంటే చంద్రబాబుకు రిమాండ్ విధించి జైలులో ఉంచటం కాదు హౌస్ అరెస్టులో ఉండేట్లుగా ఆదేశాలు ఇవ్వాలని వాదించారు. సరే లూథ్రా వాదనలకు వ్యతిరేకంగా సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును రాజమండ్రి జైలులో కాకుండా ఇంట్లో ఎందుకు ఉంచాలి ? అందుకు లూథ్రా చెప్పిన కారణాలు మరీ పేలవంగా ఉన్నాయి.





ఎంత పేలవంగా ఉన్నాయంటే ఆయన వాదనలోని పాయింట్లే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇంతకీ లూథ్రా చెప్పిందేమంటే చంద్రబాబు ఎన్ఎస్జీ సెక్యూరిటీలో ఉండే వ్యక్తికాబట్టి హౌస్ అరెస్టుకు అనుమతించమన్నారు. మరోసారి జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్నారు. జైలులో కరడుగట్టిన నేరస్ధులు ఉన్నారు కాబట్టి  చంద్రబాబుకు సేఫ్ కాదట. ఎన్ఎస్జీ సెక్యూరిటిలో ఉన్న వ్యక్తనీ లూథ్రానే అంటారు. జైలులో నేరస్ధులున్నారు కాబట్టి చంద్రబాబుకు ప్రాణహానని లూథ్రానే వాదించారు. ఎన్ఎస్జీ సెక్యూరిటితో పాటు రెగ్యులర్ పోలీసులను కూడా భారీఎత్తున చంద్రబాబుకు రక్షణగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.





పైగా చంద్రబాబును ఉంచిన అప్పర్ బ్యారెక్స్ లో అందరినీ ఇతర బ్యారెక్సుకు బదిలీచేసింది ప్రభుత్వం. అంత హెవీ సెక్యూరిటిలో ఉండే చంద్రబాబుకు ప్రాణహాని ఎవరినుండి ఉంటుంది ? ప్రాణహాని ఎవరినుండో మాత్రం చెప్పలేదు. అంటే లూథ్రా గాలిలో బాణం వేశారని తెలిసిపోతోంది. అందుకనే పొన్నవోలు వాదిస్తు చంద్రబాబుకు హౌస్ కన్నా జైలే సేఫ్ అన్నది. పైగా చంద్రబాబు రక్షణ ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని గుర్తుచేశారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>