MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2992fb33-20f6-47a6-8df0-4c9272b1afb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2992fb33-20f6-47a6-8df0-4c9272b1afb2-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అలనాటి హీరోయిన్లలో భానుమతి రామకృష్ణ కూడా ఒకరు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, గాయనిగా, స్వరకర్తగా కూడా మంచి పేరు తెచ్చుకుంది..!! ఇలా అన్ని రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారి అత్యధిక పారితోషకం తీసుకున్న నటి కూడా ఈమెనే కావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ ఎవరంటే భానుమతి రామకృష్ణ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర tollywood{#}bhanumathi old;Girl;Telugu;Father;gold;Rajani kanth;Heroine;Cinemaభారతదేశంలో మొట్ట మొదటిసారి అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్..!?భారతదేశంలో మొట్ట మొదటిసారి అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్..!?tollywood{#}bhanumathi old;Girl;Telugu;Father;gold;Rajani kanth;Heroine;CinemaWed, 13 Sep 2023 11:44:41 GMTహీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అలనాటి హీరోయిన్లలో భానుమతి రామకృష్ణ కూడా ఒకరు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, గాయనిగా, స్వరకర్తగా కూడా  మంచి పేరు తెచ్చుకుంది..!! ఇలా అన్ని రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారి అత్యధిక పారితోషకం తీసుకున్న నటి కూడా ఈమెనే కావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ ఎవరంటే భానుమతి రామకృష్ణ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.90  ఉన్నప్పుడు భానుమతి ఒక్కో సినిమాకి రూ.25,000 వసూలు చేసేవారు. 

అంటే ప్రస్తుత కాలంలో చూసుకుంటే రెండు కోట్ల రూపాయలతో తో సమానం. తన 60 ఏళ్ల సినీ జీవితంలో భానుమతి 97 తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల్లో పనిచేశారు. అంతేకాదు తెలుగు సినిమాకి మొదటి మహిళా దర్శకురాలు కూడా ఈమెనే. హీరోయిన్ అయిన తర్వాత దర్శకురాలిగా మారి 1953 లో 'చండీరాణి' అనే సినిమాను తీశారు. భారతీయ సినిమాకు ఆమె అందించిన సేవలకు గాను భానుమతికి 2001లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన భానుమతి చిన్నప్పటినుంచి తన తండ్రి స్టేజ్ పై ప్రదర్శనలు చేస్తుంటే చూసేవారు. 1939 లో భానుమతికి కేవలం 13 ఏళ్ల వయసులోనే మొదటి సినిమా అవకాశం లభించింది. 

'వరవిక్రయం' అనే చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టారు భానుమతి. ఈ సినిమాలో కలింది అనే 13 ఏళ్ల అమ్మాయి పాత్రను పోషించారు. సినిమాలో ఆమెకు ఓ వృద్ధుడితో బలవంతంగా వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత 'మాలతి మాధవం', 'ధర్మపత్ని', 'భక్తిమాల' వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. అయితే కెరీర్ ప్రారంభంలో 'కృష్ణ ప్రేమ' అనే సినిమా నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక 1951లో భానుమతి నటించిన మ్యూజికల్ సూపర్ హిట్ మూవీ 'మల్లేశ్వరి' తర్వాత ఆమె కెరియర్ టాప్ ప్లేస్ కి చేరుకుంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>