Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/are-you-jealous-asks-mahesh-babu7fed64d6-8fdf-47ae-8cae-dc62543ad108-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/are-you-jealous-asks-mahesh-babu7fed64d6-8fdf-47ae-8cae-dc62543ad108-415x250-IndiaHerald.jpgతమిళంలో యాక్టర్ కం డైరెక్టర్ అయిన ఎస్.జె సూర్య అక్కడ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. డైరెక్టర్ గా సక్సెస్ అయినా కూడా నటుడిగా అతను ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఈమధ్య ఆయన తమిళంలో ప్రతి సినిమాలో నటిస్తున్నారు. నటుడిగా కెరీర్ లో ఫుల్ ఫాం లో ఉన్న ఎస్.జె సూర్య లేటెస్ట్ గా విశాల్ తో మార్క్ ఆంటొని సినిమా చేశాడు. ఆ సినిమాలో విశాల్ తర్వాత అంత వెయిట్ ఉన్నmahesh{#}abinaya;Nani;vishal krishna;kushi;Kushi;Director;surya sivakumar;Joseph Vijay;Event;Success;Tollywood;Cinemaఆయన చేస్తా అన్నాడు మహేష్ ఛాన్స్ ఇవ్వాలిగా..!ఆయన చేస్తా అన్నాడు మహేష్ ఛాన్స్ ఇవ్వాలిగా..!mahesh{#}abinaya;Nani;vishal krishna;kushi;Kushi;Director;surya sivakumar;Joseph Vijay;Event;Success;Tollywood;CinemaWed, 13 Sep 2023 12:26:00 GMTతమిళంలో యాక్టర్ కం డైరెక్టర్ అయిన ఎస్.జె సూర్య అక్కడ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. డైరెక్టర్ గా సక్సెస్ అయినా కూడా నటుడిగా అతను ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఈమధ్య ఆయన తమిళంలో ప్రతి సినిమాలో నటిస్తున్నారు. నటుడిగా కెరీర్ లో ఫుల్ ఫాం లో ఉన్న ఎస్.జె సూర్య లేటెస్ట్ గా విశాల్ తో మార్క్ ఆంటొని సినిమా చేశాడు. ఆ సినిమాలో విశాల్ తర్వాత అంత వెయిట్ ఉన్న పాత్రలో ఎస్.జె సూర్య కనిపించనున్నారు. ఈ సినిమాలో రీతు వర్మ, అభినయ హీరోయిన్స్ గా నటించారు.

సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్.జె సూర్య మన టాలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడారు. పవన్ ఖుషి తోనే తనకు మొదటి సూపర్ హిట్ అందిందన్న ఎస్.జె సూర్య తమిళంలో అజిత్, విజయ్ లాంటి పెద్ద హీరోలతో చేశానని ఇక్కడ పవన్, మహేష్ లాంటి స్టార్స్ ని డైరెక్ట్ చేశానని అన్నారు. అంతేకాదు పవన్ కు ఖుషితో హిట్ ఇచ్చా కానీ మహేష్ తో నాని సినిమా చేశా అది ఫ్లాప్ అయ్యిందని అన్నారు.

మహేష్ కు హిట్ బాకీ ఉన్నా.. ఎప్పటికైనా మహేష్ కు హిట్ ఇచ్చి తీరుతా అంటున్నారు ఎస్.జె సూర్య. అయితే మహేష్ తో సినిమా చేయాలని అనుకుంటున్న డైరెక్టర్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఎస్.జె సూర్య వచ్చి నేను కూడా మహేష్ ని డైరెక్ట్ చేస్తా అనడం సర్ ప్రైజింగ్ గా ఉంది. ఇతను చేస్తానని చెప్పినా అక్కడ మహేష్ అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పుకుంటున్నారు. మహేష్ తో ఎస్.జె సూర్య 2004 లో నాని సినిమా చేశారు. ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే మహేష్ కు హిట్ ఇవ్వాలని ఉత్సాహంగా ఉన్నారు ఎస్.జె సూర్య.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాస్టింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మహేష్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>