EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-stamina-chusi-jail-sibbandi-shock9290b1f3-e5dd-4f75-a3b1-190d9efd48ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-stamina-chusi-jail-sibbandi-shock9290b1f3-e5dd-4f75-a3b1-190d9efd48ce-415x250-IndiaHerald.jpgచంద్రబాబు స్కిల్‌డెవలప్‌ మెంట్‌ అవినీతి కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే ఆయన అరెస్టు నుంచి రాజమండ్రి జైలుకు వచ్చేవరకూ అంతా హైడ్రామా నడిచింది. శుక్రవారం రాత్రి నుంచి ఆయన వ్యాన్ ను చుట్టు ముట్టారు పోలీసులు. అంటే అప్పుడే చంద్రబాబుకు సమాచారం వచ్చి ఉంటుంది. అలా శుక్రవారం రాత్రి అంతా బహుశా నిద్ర ఉండి ఉండదు. ఆ తర్వాత శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేశారు. నంద్యాల నుంచి ఆయన రోడ్డు మార్గంలోనే విజయవాడ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 9 గంటలపాటు జర్నీ చేశారు. చంద్రబాబు వయస్సు 73 ఏళ్లు. CHANDRABABU{#}Nandyala;Sugar;News;Friday;Journey;CBN;Vijayawada;Saturday;sunday;Rajahmundryచంద్రబాబు స్టామినా చూసి జైలు సిబ్బంది షాక్‌?చంద్రబాబు స్టామినా చూసి జైలు సిబ్బంది షాక్‌?CHANDRABABU{#}Nandyala;Sugar;News;Friday;Journey;CBN;Vijayawada;Saturday;sunday;RajahmundryWed, 13 Sep 2023 00:00:00 GMTచంద్రబాబు స్కిల్‌డెవలప్‌ మెంట్‌ అవినీతి కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే ఆయన అరెస్టు నుంచి రాజమండ్రి జైలుకు వచ్చేవరకూ అంతా హైడ్రామా నడిచింది. శుక్రవారం రాత్రి నుంచి ఆయన వ్యాన్ ను చుట్టు ముట్టారు పోలీసులు. అంటే అప్పుడే చంద్రబాబుకు సమాచారం వచ్చి ఉంటుంది. అలా శుక్రవారం రాత్రి అంతా బహుశా నిద్ర ఉండి ఉండదు. ఆ తర్వాత శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేశారు.


నంద్యాల నుంచి ఆయన రోడ్డు మార్గంలోనే విజయవాడ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 9 గంటలపాటు జర్నీ చేశారు. చంద్రబాబు వయస్సు 73 ఏళ్లు. బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. విజయవాడ వచ్చాక.. విచారణ సాగింది. రాత్రి వైద్య పరీక్షలు, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అంతా జరిగాయి. అంటే శనివారం కూడా నిద్ర లేదు. ఆదివారం ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆదివారం అంతా వాదనలు జరిగాయి. చంద్రబాబు కోర్టులోనే ఉన్నారు. ఓవైపు కోర్టులో టెన్షన్‌.. మరోవైపు న్యాయవాదులతో చర్చలు.. ఇలా రోజంతా టెన్షన్‌గానే నడిచింది.


ఆ సమయంలో చంద్రబాబు ఓ మామూలు ప్లాస్టిక్‌ కుర్చీలోనే రోజంతా కూర్చున్నారు.  ఆ తర్వాత రిమాండ్‌ విధించాక ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి ఓవైపు వర్షం.. ఆ వర్షంలో చంద్రబాబును విజయవాడ నుంచి రాజమండ్రికి తరలించారు. రాత్రి ఒకటిన్నర సమయంలో చంద్రబాబును రాజమండ్రి జైలుకు చేరుకున్నారు. అంటే శుక్రవారం రాత్రి మొదలైన ఈ వ్యవహారం ఆదివారం రాత్రితో ముగిసింది.


అంటే మొత్తం 48 గంటలపాటు చంద్రబాబు ఏమాత్రం విశ్రాంతి లేకుండా గడిపారు. ఆ వయస్సులో అంత ఇబ్బందిని తట్టుకోవడం అంటే సాధారణంగా చాలా డల్ అవుతారు. కానీ చంద్రబాబు మాత్రం రాజమండ్రి జైలుకు వెళ్లాక కూడా చాలా కూల్‌గా ఉన్నారని చూసిన వారు చెబుతున్నారు. జైలులో చేరేటప్పుడు చంద్రబాబు హుషారుగా ఉన్న తీరు చూసి జైలు సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారట. అదీ చంద్రబాబు స్టామినా అంటున్నారు ఆయన అభిమానులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : జగన్ అంటే వణుకుతున్న టీడీపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>