MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money5b3d5143-a160-41b2-aabe-8cbaa25bddc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money5b3d5143-a160-41b2-aabe-8cbaa25bddc2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పెన్షన్ దారుల కోసం కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్షేమమే తిరిగి తనకు అధికారం అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి అదే సమయంలో పాలన, పార్టీ పరంగా కూడా వరుస నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. సంక్షేమ ఓటు బ్యాంకు ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పెన్షన్ దారులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాదికి రూ.2,250 చొప్పున పెంచMONEY{#}Qualification;Party;Telangana Chief Minister;Jagan;Elections;september;GovernmentMoney: పెన్షన్ దారులకు శుభవార్త తెలిపిన సీఎం జగన్..!Money: పెన్షన్ దారులకు శుభవార్త తెలిపిన సీఎం జగన్..!MONEY{#}Qualification;Party;Telangana Chief Minister;Jagan;Elections;september;GovernmentWed, 13 Sep 2023 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పెన్షన్ దారుల కోసం కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్షేమమే తిరిగి తనకు అధికారం అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి అదే సమయంలో పాలన, పార్టీ పరంగా కూడా వరుస నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. సంక్షేమ ఓటు బ్యాంకు ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పెన్షన్ దారులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాదికి రూ.2,250 చొప్పున పెంచుతూ వచ్చే ఏడాది పెన్షన్ ను రూ .3 వేలకు పెన్షన్ ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

అయితే ఇదే సమయంలో అర్హత ఉండి పెన్షన్ అందని వారిని గుర్తించేందుకు గత రెండు నెలల కాలంలో జగనన్న సురక్ష ద్వారా ఇంటింటా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఇక అందులో అర్హత పొందిన వారికి పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పటికే కొత్తగా 1.48లక్షల మందికి పెన్షన్ అందిస్తూ ఉండగా ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి 1.93 లక్షల మందికి పైగా పెన్షన్ దారులు చేరారు. దీంతో రికార్డ్ స్థాయిలో ప్రతినెలా పింఛన్ అందుకునే వారి సంఖ్య 65,98 ,138 కి చేరింది. ఈ క్రమంలోనే తాజాగా కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే పింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈనెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక ఈనెల పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితా విషయానికి వస్తే ఈ నెలలో కొత్తగా 1,93,680 మంది లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తుండగా అందులో 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4000మంది హెచ్ఐవి బాధితులు,  2,844మంది కల్లుగీత కార్మికులు, 4,763 మంది మత్స్యకారులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఎప్పటిలాగే ఈనెల 1వ తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో కొత్తగా మంజూరైన వారికి కూడా పింఛన్లను అందజేశారు. ఇక సెప్టెంబర్ ఒకటవ తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛన్ మంజూరు చేయగా సుమారుగా రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న బిందు మాధవి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>