Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8e95dff2-7f0a-4156-863a-dbdf037e44a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8e95dff2-7f0a-4156-863a-dbdf037e44a8-415x250-IndiaHerald.jpgసౌత్ బ్యూటీ ప్రియమణి బహుభాషా నటి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఈ భామ అందరి కళ్లల్లో పడింది. తమిళంలో వచ్చిన పరుత్తివీరన్‌ మూవీలో ప్రియమణి నటనకు అందరూ ఫిదా అయిపోయారు.మొదటి సినిమాతోనే నేషనల్ బెస్ట్ యాక్టర్‎గా అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్‎లలో ఈ బామ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్‎లోనూ షారుక్ ఖాన్ సినిమా చెన్నై ఎక్స్‎ప్రెస్ లో స్పెషల్ సాంగ్‎లో కనిపించి దుమ్ముదులిపేసింది. కాగా పెళ్లి తరువాత ప్రియమణి తన ఏజ్‎కి తగిన క్యారెక్టర్లను చూస్తూ ప్రత్యేకమైన గుsocialstars lifestyle{#}Avunu;Aryaa;Darsakudu;arya;bhama;Fidaa;nayantara;Telugu;BEAUTY;marriage;Jawaan;priyamani;atlee kumar;Director;Tamil;Cinemaఅట్లీ నన్ను మోసం చేసాడు అంటున్న సౌత్ బ్యూటీ...!!అట్లీ నన్ను మోసం చేసాడు అంటున్న సౌత్ బ్యూటీ...!!socialstars lifestyle{#}Avunu;Aryaa;Darsakudu;arya;bhama;Fidaa;nayantara;Telugu;BEAUTY;marriage;Jawaan;priyamani;atlee kumar;Director;Tamil;CinemaWed, 13 Sep 2023 22:20:00 GMTసౌత్ బ్యూటీ ప్రియమణి బహుభాషా నటి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఈ భామ అందరి కళ్లల్లో పడింది. తమిళంలో వచ్చిన పరుత్తివీరన్‌ మూవీలో ప్రియమణి నటనకు అందరూ ఫిదా అయిపోయారు.మొదటి సినిమాతోనే నేషనల్ బెస్ట్ యాక్టర్‎గా అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్‎లలో ఈ బామ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్‎లోనూ షారుక్ ఖాన్ సినిమా చెన్నై ఎక్స్‎ప్రెస్ లో స్పెషల్ సాంగ్‎లో కనిపించి దుమ్ముదులిపేసింది. కాగా పెళ్లి తరువాత ప్రియమణి తన ఏజ్‎కి తగిన క్యారెక్టర్లను చూస్తూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది. తాజాగా ప్రియమణి షారుక్ ఖాన్ హీరోగా నయనతార కథానాయకిగా నటించిన జవాన్‌ మూవీలో కీ రోల్ పోషించింది. ఈ చిత్రంలో తన క్యారెక్టర్‎కు సంబంధించి కొన్ని విషయాలను తాజాగా ప్రియమణి షేర్ చేసుకుంది. జవాన్‌లో ఆఫర్ అనగానే ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించానని, కానీ షారుక్‌ ఖాన్‌ టీంలో ఒకరిగా ప్రధానమైన పాత్ర అని తెలియగానే సంతోషించాని తెలిపింది.

ఓ భేటీలో ప్రియమణి మాట్లాడుతూ..." జవాన్ డైరెక్టర్ అట్లీ అని తెలియగానే ఓకే అన్నాను. ఒకసారి జూమ్‌ కాల్‌లో అట్లీ, ఆర్య నాతో మాట్లాడారు. అట్లీ తన ఫ్రెండ్‎ అని ఇంట్రడ్యూస్ చేసి ఆర్య వెళ్లిపోయాడు. నేను జవాన్‌‎లో నటిస్తున్నాను అని వార్త రాగానే ఏదో స్పెషల్ సాంగ్‌ అయ్యింటుందనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ దర్శకుడు అట్లీ నన్ను ఓ విషయంలో మోసం చేశాడు. అప్పట్లో జవాన్‌ మూవీ అనౌన్స్ కాగానే తమిళ వర్షన్‌లో స్టార్ యాక్టర్ విజయ్‌ అతిథి పాత్రలో నటిస్తాడని , తెలుగు వెర్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపిస్తాడని ప్రచారం హోరెత్తింది. ఈ క్రమంలో విజయ్‌ ఈ మూవీలో నటిస్తున్నారా..? అని నేను అట్లీని అడిగాను. అవును అని అన్నాడు. నాకు విజయ్‌తో ఒక్క సీన్‎లో అయినా నటించే ఛాన్స్ ఇవ్వమని కోరాను. అయితే చివరి వరకూ తెలియదు అట్లీ నన్ను మోసం చేశాడని. నిజానికి ఈ మూవీలో విజయ్‌ గానీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ గానీ నటించలేదు" అని ప్రియమణి చెప్పింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైట పక్కకు జరిపి కుర్రాళ్లకు గాలం వేస్తున్న రకుల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>