MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd5b2e30b-2f45-4a17-8bdd-b4dc51f1ffa9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd5b2e30b-2f45-4a17-8bdd-b4dc51f1ffa9-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే నడుస్తోంది అని చెప్పాలి. తమిళంలో సైతం కొన్ని సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే సుమారు 14 ఏళ్ల క్రిందట తమిళంలో రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని 'జిగర్తాండ' మూవీకి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'జిగర్తాండ డబుల్ ఎక్స్' పేరుతో వస్తున్న ఈ సీక్వెల్ అనౌన్స్మెంట్ వీడియో తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసింది. రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా విడుదల tollywood{#}Gangster;Rakshit Shetty;jeevitha rajaseskhar;raghava lawrence;Karthik;surya sivakumar;Mass;Audience;Director;Tollywood;Cinema;India;september;Tamilఆకట్టుకుంటున్న 'జిగర్తాండ డబుల్ ఎక్స్' టీజర్..!!ఆకట్టుకుంటున్న 'జిగర్తాండ డబుల్ ఎక్స్' టీజర్..!!tollywood{#}Gangster;Rakshit Shetty;jeevitha rajaseskhar;raghava lawrence;Karthik;surya sivakumar;Mass;Audience;Director;Tollywood;Cinema;India;september;TamilTue, 12 Sep 2023 12:55:59 GMTటాలీవుడ్ లో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే నడుస్తోంది అని చెప్పాలి. తమిళంలో సైతం కొన్ని సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే సుమారు 14 ఏళ్ల క్రిందట తమిళంలో రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని 'జిగర్తాండ' మూవీకి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'జిగర్తాండ డబుల్ ఎక్స్' పేరుతో వస్తున్న ఈ సీక్వెల్ అనౌన్స్మెంట్ వీడియో తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసింది. రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ ను పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా చిత్ర టీజర్ ను సౌత్ లో ఉన్న పలువురు స్టార్స్ రిలీజ్ చేయడం విశేషం. తెలుగులో మహేష్ బాబు, తమిళంలో ధనుష్, మలయాళం లో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి.. 'జిగర్తాండ డబుల్ ఎక్స్' టీజర్ ను లాంచ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిమిషా సజయన్ హీరోయిన్గా నటిస్తోంది. 2009లో వచ్చిన 'జిగర్తాండ'కి సిక్వల్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ మళ్లీ ఆ సినిమాను గుర్తు చేసేలా ఉంది. ఓ ఫిలిం మేకర్ గ్యాంగ్ స్టార్ చుట్టూ తిరిగే కథ ఇది. ఓ క్రైమ్ స్టోరీ కోసం వెతుకుతున్న డైరెక్టర్ కి రియల్ లైఫ్ గ్యాంగ్ స్టర్ తన జీవిత చరిత్రనే సినిమాగా తీయాలని చెప్పడంతో కథలో అసలు ట్విస్ట్ వస్తోంది. 

ఇందులో డైరెక్టర్ పాత్రలో ఎస్ జె సూర్య, గ్యాంగ్ స్టర్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. తాజాగా విడుదలైన టీజర్ లో లారెన్స్ గన్స్ పట్టుకొని బీడీ తాగుతూ పక్కా మాస్ అవతార్లో కనిపించగా, SJ సూర్య సూట్ వేసుకొని స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక టీజర్ లో అన్ని భాషల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కేవలం ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే పెట్టారు. 1975లో జరిగిన కథగా ఈ సీక్వెల్ని తెరకెక్కించారు. దాంతో ఆ కాలంలోకి తీసుకెళ్లడానికి మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక టీజర్ చివర్లో రాఘవ లారెన్స్ ఓ ఫన్నీ డైలాగ్ తో ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా అనే దానిని పాండియా వెస్టర్న్ అంటూ లారెన్స్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఈ మూవీని తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 28న ఈ సినిమా  విడుదల చేస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>