MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shri-leela-761fb2e0-227c-491a-9acb-0cf81128c9c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shri-leela-761fb2e0-227c-491a-9acb-0cf81128c9c9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈ అందాల తార చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను శ్రీల ఫాలో అవుతూ ప్రస్తుతం అరడజనుకు పైగాని సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తూ రోజురోజుకీ బిజీగా మారుతుంది. దీంతో ఆమె కు క్రేజ్ తో Shri Leela {#}sree;tara;ram pothineni;marriage;ravi teja;Ravi;Cinema;media;House;Tollywood;News;Heroine;Eventఒక్క షాప్ ఓపెనింగ్ కు అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న శ్రీ లీల..!?ఒక్క షాప్ ఓపెనింగ్ కు అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న శ్రీ లీల..!?Shri Leela {#}sree;tara;ram pothineni;marriage;ravi teja;Ravi;Cinema;media;House;Tollywood;News;Heroine;EventTue, 12 Sep 2023 16:45:00 GMTప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈ అందాల తార చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను శ్రీల ఫాలో అవుతూ ప్రస్తుతం అరడజనుకు పైగాని సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తూ రోజురోజుకీ బిజీగా మారుతుంది.

దీంతో ఆమె కు క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది. అయితే ఈ చిన్నది తన మొదటి సినిమా పెళ్లి సందడి కి కేవలం ఐదు లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంది. దాని తరువాత ఈ అందాల తార నటించిన రవితేజ ధమాకా సినిమాకి గాను 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంది. అనంతరం రామ్ హీరోగా వస్తున్న స్కంద సినిమాకి గాను ఏకంగా కోటి రూపాయలను తీసుకుని అందరికీ భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ లీలా నటిస్తున్న ఆరు సినిమాలకి గాను ఒక్కొక్క సినిమాకి దాదాపుగా ఐదు కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత తన తర్వాతి సినిమాలకు గాను ఎనిమిది కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకోవాలని శ్రీ లీల ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్క సినిమాలే కాకుండా షాపింగ్ మాల్స్ సైతం ఓపెనింగ్ చేస్తూ సందడి చేస్తోంది. ఒక్క మాల్ ఓపెనింగ్ కు ఏకంగా కోటికి పైగానే రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది శ్రీ లీల. ఈ ఓపెనింగ్ ఈవెంట్ లో శ్రీ లీల ఉండేది కేవలం 10 నిమిషాలే అయినప్పటికీ పది నిమిషాలకి గాను కోటి రూపాయలు, వసూలు చేస్తుంది అంటే నిమిషానికి ఎంత కాదనుకున్నా పదిలక్షలన్నమాట..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>