Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli-py-prasamsala-varsham-kuripinchina-aa-country-president01818e8e-36d4-49ee-8f82-bdebd7693c28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli-py-prasamsala-varsham-kuripinchina-aa-country-president01818e8e-36d4-49ee-8f82-bdebd7693c28-415x250-IndiaHerald.jpgగత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను కొమురం భీమ్‌ - అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధుల కల్పిత కథతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో,ఎన్టీఆర్‌ కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ సీత పాత్రలో నటించి మెప్పించింది.అలాగే విదేశీ నటి ఓలివియా మోరిస్ జెన్నీ పాత్రలో అద్భుతంగా నటించింది.భారీ అంచనాలతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్socialstars lifestyle{#}Alia Bhatt;seetha;Alluri Sitarama Raju;Komaram Bheem;RRR Movie;Alluri Seetha Rama Raju;bollywood;Rajamouli;Varsham;Chitram;Cinema;mediaరాజమౌళి మూవీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆ దేశ అధ్యక్షుడు....!!రాజమౌళి మూవీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆ దేశ అధ్యక్షుడు....!!socialstars lifestyle{#}Alia Bhatt;seetha;Alluri Sitarama Raju;Komaram Bheem;RRR Movie;Alluri Seetha Rama Raju;bollywood;Rajamouli;Varsham;Chitram;Cinema;mediaTue, 12 Sep 2023 11:15:00 GMTగత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి  ఈ సినిమాను కొమురం భీమ్‌ - అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధుల కల్పిత కథతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో,ఎన్టీఆర్‌ కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ సీత పాత్రలో నటించి మెప్పించింది.అలాగే విదేశీ నటి ఓలివియా మోరిస్ జెన్నీ పాత్రలో అద్భుతంగా నటించింది.భారీ అంచనాలతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని విజయం విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు పైగా రాబట్టింది.. మరోవైపు ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌'పై బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా ప్రశంసల వర్షం కురిపించారు. తనకెంతో నచ్చిన భారతీయ చిత్రం ఇదేనని ఆయన అన్నారు. 

ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో అద్భుతంగా ఉందన్న ఆయన చిత్రయూనిట్ ను మెచ్చుకున్నారు.''ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా నాకు బాగా నచ్చంది. 3 గంటలు నిడివి ఉన్న ఫీచర్‌ ఫిల్మ్‌ ఇది. అద్భుతమైన సన్నివేశాలు అలాగే అందమైన డ్యాన్సులు ఈ సినిమాలో ఉన్నాయి. భారత్‌పై బ్రిటిష్‌ కంట్రోల్‌ను తెలియజేస్తూ లోతైన విమర్శ చేసినప్పటికీ కూడా దానిని కూడా ఎంతో అర్థవంతంగా చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసిన వాళ్లందరినీ కూడా 'మీరు 'ఆర్‌ఆర్‌ఆర్‌' వీక్షించారా..అని నేను మొదటగా అడిగాను . ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా చూసి నేను ఎంజాయ్‌ చేశాను. ఆర్ఆర్ఆర్ చిత్రదర్శకుడు మరియు నటీనటులకు నా అభినందనలు'' అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.కాగా, దీనికి సంబంధించిన ఓ వీడియోను 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ తాజాగా సోషల్ మీడియా లో షేర్‌ చేసింది. ''మా చిత్రంపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్యూ సర్‌. మీ ప్రశంసలతో మా టీమ్‌ మొత్తం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపిస్తున్న "జవాన్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>