MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1f29b35f-a821-4d79-8574-0effe18b96ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1f29b35f-a821-4d79-8574-0effe18b96ef-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొందరు హీరోయిన్స్ సిల్వర్ స్క్రీన్ పై అలా మెరిసి ఒకటి రెండు సినిమాల తర్వాత ఎవరికీ కనిపించకుండా పోతారు. కొందరు మాత్రం తమ టాలెంట్ తో కొన్ని నీళ్లు పాటు హీరోయిన్గా కొనసాగుతారు. మరికొందరు ఐదేళ్లు ఇండస్ట్రీలో ఉండడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా చాలా కొద్దిమంది మాత్రమే హీరోలతో సమానంగా దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతారు. అలాంటి వారిలో త్రిష కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా చలామణి అవుతోంది tollywood{#}lyca productions;silver screen;Dalapathi;Kumaar;Trisha Krishnan;Varsham;Sanjay Dutt;News;september;Hero;Heroine;Joseph Vijay;Tamil;Cinemaమరో క్రేజీ ఆఫర్ పట్టేసిన త్రిష.. ఏకంగా ఆ స్టార్ హీరో కి జోడిగా..!?మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన త్రిష.. ఏకంగా ఆ స్టార్ హీరో కి జోడిగా..!?tollywood{#}lyca productions;silver screen;Dalapathi;Kumaar;Trisha Krishnan;Varsham;Sanjay Dutt;News;september;Hero;Heroine;Joseph Vijay;Tamil;CinemaTue, 12 Sep 2023 19:20:00 GMTసాధారణంగా కొందరు హీరోయిన్స్ సిల్వర్ స్క్రీన్ పై అలా మెరిసి ఒకటి రెండు సినిమాల తర్వాత ఎవరికీ కనిపించకుండా పోతారు. కొందరు మాత్రం తమ టాలెంట్ తో కొన్ని నీళ్లు పాటు హీరోయిన్గా కొనసాగుతారు. మరికొందరు ఐదేళ్లు ఇండస్ట్రీలో ఉండడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా చాలా కొద్దిమంది మాత్రమే హీరోలతో సమానంగా దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతారు. అలాంటి వారిలో త్రిష కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా చలామణి అవుతోంది త్రిష.

తమిళ పొన్ను త్రిష రెండు దశాబ్దాలుగా అటు తమిళం ఇటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. 1999లో తమిళ్లో జోడి సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది త్రిష. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వర్షం సినిమా త్రిష కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. అయితే అలా వరుస సినిమాలు చేస్తూ ఉన్న త్రిష చిరంజీవి నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది అన్న వార్తలు గత కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మరొక క్రేజీ ఆఫర్ పట్టేసింది అని అంటున్నారు. స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా వస్తున్న విడాముయర్చి

సినిమాలో త్రిషని హీరోయిన్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్రిష అజిత్ కాంబినేషన్లో ఇది ఐదవ సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ అర్జున్ దాస్ సైతం కీలక పాత్రలో కనిపించబోతున్నారట. సెప్టెంబర్ చివరి వారంలో అబూ దాబిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ప్రస్తుతం దళపతి విజయ్ సరసన లియో సినిమాలో నటిస్తోంది త్రిష. విజయ్ త్రిష కాంబినేషన్లో కూడా గతంలో పలు సినిమాలు వచ్చాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాబుకు భయం ఎలా ఉంటుందో చూపించిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>