Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelalaaa8d0ded-8fa1-4c1c-9c80-5428fafe3d74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelalaaa8d0ded-8fa1-4c1c-9c80-5428fafe3d74-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరో వరకు ఎవరిదైనా కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది అంటే చాలు ఇక అందులో హీరోయిన్ శ్రీ లీలనే అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. అంతలా బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ అమ్మడు. పెళ్లి సందడి అనే సినిమాతో ఎంట్ర ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. ఇక ప్రస్తుతం కెరియర్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది. ఏకంగా హీరోలను డామినేట్ చేసే పర్ఫSreelala{#}Tollywood;marriage;sree;Success;Chakram;Hero;House;Heroine;Cinemaతగ్గేదేలే అంటున్న శ్రీలీలా.. నిమిషానికి రూ.10 లక్షలట?తగ్గేదేలే అంటున్న శ్రీలీలా.. నిమిషానికి రూ.10 లక్షలట?Sreelala{#}Tollywood;marriage;sree;Success;Chakram;Hero;House;Heroine;CinemaTue, 12 Sep 2023 08:23:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరో వరకు ఎవరిదైనా కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది అంటే చాలు ఇక అందులో హీరోయిన్ శ్రీ లీలనే అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. అంతలా బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ అమ్మడు. పెళ్లి సందడి అనే సినిమాతో ఎంట్ర ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది.  ఇక ప్రస్తుతం కెరియర్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి.


 ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది. ఏకంగా హీరోలను డామినేట్ చేసే పర్ఫామెన్స్ తో ప్రశంసలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లు వచ్చాయి అంటే చాలు ఇక పారితోషకం కూడా అదే రేంజిలో పెరిగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీలీలా చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. ఇందులో ఎనిమిది సినిమాలు తెలుగులో ఉంటే రెండు సినిమాలు కన్నడలో ఉన్నాయని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఇక రాబోయే ప్రతి పండక్కి తన సినిమాతో శ్రీలీలా  ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది అని చెప్పాలి.


 అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఫాలో అవుతుంది శ్రీ లీల. ఇక ఇప్పుడు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలోనే పారితోషకాన్ని అమాంతం పెంచేసింది. ఏకంగా ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇకపై సైన్ చేయబోయే ప్రాజెక్టులకు ఆరు నుంచి ఏడు కోట్లు డిమాండ్ చేయాలని ఫిక్స్ అయిందట. ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా చేస్తుంది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఉంటే పది లక్షలు ఇవ్వాలని చెబుతుందట. ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని పది లక్షలు అన్నమాట. పైగా ఫ్లైట్ ఖర్చులు హోటల్ బిల్స్ కూడా ఇక షాపింగ్ మాల్ నిర్వాహకులు చూసుకోవాలట. ఈ విషయం తెలిసి ఇది మరీ టూమచ్ కదా అని కొంతమంది నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపిస్తున్న "జవాన్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>