MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d6ee37f-19f1-4468-8f73-8a403d680c86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d6ee37f-19f1-4468-8f73-8a403d680c86-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి క్లాస్ సినిమాలు తో డైరెక్టర్గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇటీవల విక్టరీ వెంకటేష్ తో నారప్ప వంటి సినిమా చేసి మాస్ డైరెక్టర్ గా కూడా ప్రూఫ్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే మరో రియాలిస్టిక్ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెదకాపు'. ఓ సామాన్యుడి సంతకం అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు tollywood{#}srikanth addala;tanikella bharani;Miryala Ravinder Reddy;Research and Analysis Wing;Seethamma Vakitlo Sirimalle Chettu;Narappa;Gharshana;srikanth;VIRAT KOHLI;Venkatesh;Hero;Mass;Cinemaఆసక్తికరంగా 'పెదకాపు' ట్రైలర్ - శ్రీకాంత్ అడ్డాలకి మరో హిట్..?ఆసక్తికరంగా 'పెదకాపు' ట్రైలర్ - శ్రీకాంత్ అడ్డాలకి మరో హిట్..?tollywood{#}srikanth addala;tanikella bharani;Miryala Ravinder Reddy;Research and Analysis Wing;Seethamma Vakitlo Sirimalle Chettu;Narappa;Gharshana;srikanth;VIRAT KOHLI;Venkatesh;Hero;Mass;CinemaTue, 12 Sep 2023 11:40:00 GMTశ్రీకాంత్ అడ్డాల. ఇటీవల విక్టరీ వెంకటేష్ తో నారప్ప వంటి సినిమా చేసి మాస్ డైరెక్టర్ గా కూడా ప్రూఫ్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే మరో రియాలిస్టిక్ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెదకాపు'. ఓ సామాన్యుడి సంతకం అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నాడు. 'జయ జానకి నాయక', 'అఖండ' వంటి సినిమాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్న

 ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడే ఈ విరాట్ కర్ణ. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీతో మరోసారి తనలోని పూర్తి మాస్ ని బయట పెట్టబోతున్నారు శ్రీకాంత్ అడ్డాల. ఈ క్రమంలోనే ఓ సామాజిక వర్గానికి చెందిన పేరుని టైటిల్ గా పెట్టి సినిమాపై ఆసక్తిని కనబరిచాడు. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా చేసింది. ట్రైలర్ లోనే సినిమా కథాంశం ఏంటో చెప్పేశారు." ఒక ఆడది నూతిలో పడి ఆకాశం తప్ప ఆదుకునే వాడు లేక, అరిస్తే వినిపించుకునే వాడు లేక వెళ్లిపోయింది" అని తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. 

ఒక ఊరిలో ఇద్దరు పెద్ద మనుషుల మధ్య చిక్కుకొని ఎన్నో బాధలు పడుతున్న సామాన్య జనం అణచివేత, ఘర్షణ నేపథ్యంలో సాగుతూ వారి నుంచి ఓ హీరో పుట్టి వాళ్లపై తిరగబడి ఎలా పోరాటం చేశారు అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. సినిమాలో  శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ట్రైలర్ లో ఆయన కూడా డైలాగ్ తో ఆకట్టుకున్నారు." మీద చేయి వేసినప్పుడే తలకాయలు తీసి ఉంటే, నా కొడకా ఇంత దూరం వచ్చేది కాదని" హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. పొలిటికల్ డ్రామాతో రూపొందిన ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల తనదైన శైలిలో రా అండ్ రెస్ట్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా పార్ట్- 1 ని నవంబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..!?





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి..రజనీకాంత్ తో సినిమా చేయడం లోకేష్ కు ఇష్టం లేదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>