ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/chandrababu-naidu83dea770-4903-4f2a-a36a-28c31c79e596-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/chandrababu-naidu83dea770-4903-4f2a-a36a-28c31c79e596-415x250-IndiaHerald.jpgగడిచిన రెండు రోజుల క్రితం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సైతం CID అధికారులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే ..ఆదివారం రాత్రి సమయంలో ACB కోర్టు చంద్రబాబుకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు.. దీంతో చంద్రబాబును పోలీస్ అధికారులు సైతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట తరువాత చంద్రబాబు నాయుడుని జైలుకు తీసుకువెళ్లారు. ఇక ఖైదీ నెంబర్ 7691 గా కేటాయించడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు జైల్లోని స్నేహ బ్లాక్ ను ప్రత్యేకమైన గదిని అధికారులు కCHANDRABABU NAIDU{#}Khaidi.;Allu Sneha;Khaidi new;Amaravati;Anti-Corruption Bureau;Rajahmundry;TDP;CBN;Jagan;monday;Traffic police;Lokesh;Lokesh Kanagaraj;courtచంద్రబాబు నాయుడు పై మరో రెండు కొత్త కేసులు..!!చంద్రబాబు నాయుడు పై మరో రెండు కొత్త కేసులు..!!CHANDRABABU NAIDU{#}Khaidi.;Allu Sneha;Khaidi new;Amaravati;Anti-Corruption Bureau;Rajahmundry;TDP;CBN;Jagan;monday;Traffic police;Lokesh;Lokesh Kanagaraj;courtTue, 12 Sep 2023 07:27:00 GMTగడిచిన రెండు రోజుల క్రితం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సైతం CID అధికారులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే ..ఆదివారం రాత్రి సమయంలో acb కోర్టు చంద్రబాబుకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు.. దీంతో చంద్రబాబును పోలీస్ అధికారులు సైతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట తరువాత చంద్రబాబు నాయుడుని జైలుకు తీసుకువెళ్లారు. ఇక ఖైదీ నెంబర్ 7691 గా కేటాయించడం జరిగింది.


కోర్టు ఆదేశాల మేరకు జైల్లోని స్నేహ బ్లాక్ ను ప్రత్యేకమైన గదిని అధికారులు కేటాయించినట్లుగా తెలుస్తోంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందట. చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ ఎదురుగానే వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందట. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు పైన మరొక రెండు కొత్త కేసులు తరలించినట్లుగా తెలుస్తోంది.అందులో నిన్నటి రోజున అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పైన కేసు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరొక కేసు  కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.  మరొకవైపు ఈ రోజున వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్  వెళ్ళబోతున్నట్లు సమాచారం.


చంద్రబాబును కలవడానికి ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేష్ , బ్రాహ్మణిని మాత్రమే అనుమతించినట్లుగా తెలుస్తోంది. దీంతో వీరు చంద్రబాబుని కలిశారు.. చంద్రబాబు వయస్సు ఆరోగ్య రీత్యా ఆహారం కూడా ఇంటి నుంచి పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సోమవారం రోజు ఉదయం నుంచి కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడుకి సైతం తమ ఇంటి నుంచి ఆహారాన్ని పంపిస్తున్నారు. అక్కడ ఉన్న జైలు సిబ్బంది కూడా ఇంటి ఆహారాన్ని చంద్రబాబు నాయుడుకు అందించినట్లు తెలుస్తోంది. అలాగే ఆహారం తిన్న తర్వాత వేడి నీళ్లు బ్లాక్ కాఫీని కూడా కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడుకి పంపించినట్లు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన 'బేబీ' హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>