PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-23-haunting-chandrababu82b66bb3-3ff4-42d2-86a5-f968d02211bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-23-haunting-chandrababu82b66bb3-3ff4-42d2-86a5-f968d02211bd-415x250-IndiaHerald.jpgఆ తర్వాత రకరకాల విషయాల్లో టీడీపీకి తగిలిన ఎదురుదెబ్బలన్నీ 23వ తేదీనే తగిలాయి. చివరకు చంద్రబాబు అరెస్టయిన తేదీ, నెల, సంవత్సరాన్ని కూడితే వచ్చింది కూడా 23 సంఖ్యే. ఇపుడు జైలులో కేటాయించిన నెంబర్ మొత్తాన్ని కూడితే వచ్చింది కూడా 23. సో ఏ విధంగా చూసినా తెలుగుదేశంపార్టీ లేదా చంద్రబాబు మీద 23 అనే సంఖ్య పగపట్టిందా అనే అనుమానలు పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఇపుడు నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. chandrababu 7691{#}Google;YCP;Anti-Corruption Bureau;Reddy;TDP;CBN;Ram Gopal Varma;Darsakudu;police;Directorఅమరావతి : చంద్రబాబుపై ‘23’ పగబట్టిందా ?అమరావతి : చంద్రబాబుపై ‘23’ పగబట్టిందా ?chandrababu 7691{#}Google;YCP;Anti-Corruption Bureau;Reddy;TDP;CBN;Ram Gopal Varma;Darsakudu;police;DirectorTue, 12 Sep 2023 05:00:00 GMT



కొన్ని దేశాల్లో 13 సంఖ్య అటే చాలామంది భయపడతారు. ఎందుకంటే 13ను దుష్టసంఖ్యగా భావిస్తారు. అలాగే ఇపుడు 23 అన్నది కూడా టీడీపీ దుష్టసంఖ్యగా భావిస్తోంది. ఎందుకంటే 23 అనే సంఖ్య చంద్రబాబునాయుడును వెంటాడి వేధిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసింది. రిమాండుకు తరలించేందుకు పోలీసులు చంద్రబాబును రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.





జైలులోని అప్సరా అప్పర్ బ్లాక్ లో ఒక వీవీఐపీ గదిని చంద్రబాబుకు కేటాయించారు. అక్కడే చంద్రబాబుకు 7691 నెంబర్ ను కేటాయించారు. ఈ నెంబర్ ను కలిపితే  7+6+9+1=23 వస్తుంది. అసలు ఈ 23 అన్నది ముఖ్యమంత్రిగా ఉన్నపుడే చంద్రబాబును గట్టిగా పట్టుకున్నది. ఎలాగంటే వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 23 మందిని ప్రలోభాలకు గురిచేసి లాక్కున్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచింది సరిగ్గా 23 మంది మాత్రమే.





ఆ తర్వాత రకరకాల విషయాల్లో టీడీపీకి తగిలిన ఎదురుదెబ్బలన్నీ 23వ తేదీనే తగిలాయి. చివరకు చంద్రబాబు అరెస్టయిన తేదీ, నెల, సంవత్సరాన్ని కూడితే వచ్చింది కూడా  23 సంఖ్యే. ఇపుడు జైలులో కేటాయించిన నెంబర్ మొత్తాన్ని కూడితే వచ్చింది కూడా  23. సో ఏ విధంగా చూసినా తెలుగుదేశంపార్టీ లేదా చంద్రబాబు మీద 23 అనే సంఖ్య పగపట్టిందా అనే అనుమానలు పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఇపుడు నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.





ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల వర్మ కూడా ఇదే విషయాన్ని సెటైరికల్ గా ట్వీట్ చేశారు. 23 నెంబర్ చంద్రబాబుపై పగపట్టిందని తన ట్వీట్లో వర్మ ఎద్దేవచేశారు. మొత్తానికి ఇప్పటివరకు పలానా నెంబర్ కొడితే గూగుల్ లో జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందని టీడీపీ నేతలు ఎగతాళి చేసేవారు. దానికి కౌంటరుగా 7691 అని కొడితే ఇప్పటినుండి చంద్రబాబు పేరు కనబడుతుందని వైసీపీ నుండి కౌంటర్లు మొదలయ్యాయి. మరి 23 ఇంకా ఎంతకాలం వెంటాడుతుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : చంద్రబాబుపై ‘23’ పగబట్టిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>