EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababubcdc1d4c-a3af-4093-be58-54e975af3777-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababubcdc1d4c-a3af-4093-be58-54e975af3777-415x250-IndiaHerald.jpgస్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇలాంటి ఓ రోజు వస్తుందని చాలా మంది అంచనా వేశారు. ఇదేమీ అనూహ్యం కాదు. కాకపోతే.. సరిగ్గా ఎన్నికలకు ఇంకా సంవత్సరం కూడా లేకుండానే జగన్ అంత సాహసం చేస్తారా అన్న ఆలోచన ఉండేది. అయితే.. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు చంద్రబాబును టచ్ చేసే సాహసం చేయని జగన్‌.. ఇప్పుడు మాత్రం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వ్యూహం రచించారని చెప్పాలి. అసలు చంద్రబాబుపై వైసీపీCHANDRABABU{#}Amaravati;Anti-Corruption Bureau;Rajahmundry;YCP;CBN;Jagan;police;Governmentబాబును ఉక్కిరిబిక్కిరి చేసేలా వరుస కేసుల వ్యూహం?బాబును ఉక్కిరిబిక్కిరి చేసేలా వరుస కేసుల వ్యూహం?CHANDRABABU{#}Amaravati;Anti-Corruption Bureau;Rajahmundry;YCP;CBN;Jagan;police;GovernmentTue, 12 Sep 2023 10:00:00 GMTస్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇలాంటి ఓ రోజు వస్తుందని చాలా మంది అంచనా వేశారు. ఇదేమీ అనూహ్యం కాదు. కాకపోతే.. సరిగ్గా ఎన్నికలకు ఇంకా సంవత్సరం కూడా లేకుండానే జగన్ అంత సాహసం చేస్తారా అన్న ఆలోచన ఉండేది. అయితే.. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు చంద్రబాబును టచ్ చేసే సాహసం చేయని జగన్‌.. ఇప్పుడు మాత్రం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వ్యూహం రచించారని చెప్పాలి.


అసలు చంద్రబాబుపై వైసీపీ అవినీతి ఆరోపణలు ఎక్కువగా చేసింది ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కాదు. అమరావతి చుట్టూ భూములు దక్కించుకున్నారని.. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్ జరిపి వేల కోట్లు దోచుకున్నారని వైసీపీ ఆరోపించింది. అయితే.. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసును తెరపైకి తెచ్చింది. ఇది పెద్దగా ఎవరూ ఊహించలేదు. అయితే.. అమరావతి ల్యాండ్ కేసును నిరూపించడం అంత సులభం కాదని.. అందుకే ఆధారాలు దొరికిన స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేశారని కొందరు భావిస్తున్నారు.


అంతే కాదు.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇంకా అనేక కేసులతో చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేసేందుకు జగన్ రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసు రిమాండ్ లో ఉన్న చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్ కేసులనూ తమ కస్టడీ కోరుతూ ఇప్పటికే ఏసీబీ కోర్టులో ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. అంటే ఒక వేళ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చినా.. వెంటనే విడుదల కాకుండా మరో కేసు రెడీ చేస్తున్నారన్నమాట.


ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒక్కటే కాదు.. అంగళ్లులో మొన్న పోలీసులపై దాడి చేసిన కేసును కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా చంద్రబాబును వరుస కేసులతో గుక్కతిప్పుకోకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఒకసారి జైల్లోకి వెళ్లిన చంద్రబాబును.. ఇక ఎన్నికల ముందు వరకూ బయటకు రానీయకూడదని జగన్ భావిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన 'బేబీ' హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>