Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood9a97c1b0-e9dc-4ebb-b1a8-f430f23eaa24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood9a97c1b0-e9dc-4ebb-b1a8-f430f23eaa24-415x250-IndiaHerald.jpgప్రముఖ నటి, మోడల్ ఊర్వశి రౌతేలా 10 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఆమె హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలలో కనిపించింది. మోడలింగ్ వర్క్స్ కూడా చేసింది. వాల్తేరు వీరయ్య సినిమాలో "వేర్ ఇస్ ద పార్టీ" పాటకు అద్భుతంగా నర్తించి అదరగొట్టింది. ఇటీవలి ఇంటర్వ్యూలో, ఊర్వశి తన కెరీర్ గురించి, భవిష్యత్తుపై తన ఆశలు, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ఇప్పటి వరకు తన కెరీర్‌తో సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తులో కూడా మంచి పాత్రలు వస్తాయని నమ్మకం ఉందని చెప్పింది. అలాగే మరిన్ని హిస్టారికల్, రొమాంటికBollywood{#}urvashi;Hyderabad;bollywood;Telugu;marriage;Kannada;Husband;Beach;Bengali;Romanticఏడుసార్లు పెళ్లి చేసుకోవాలని ఉంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?ఏడుసార్లు పెళ్లి చేసుకోవాలని ఉంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?Bollywood{#}urvashi;Hyderabad;bollywood;Telugu;marriage;Kannada;Husband;Beach;Bengali;RomanticMon, 11 Sep 2023 20:30:00 GMTప్రముఖ నటి, మోడల్ ఊర్వశి రౌతేలా 10 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఆమె హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలలో కనిపించింది. మోడలింగ్ వర్క్స్ కూడా చేసింది. వాల్తేరు వీరయ్య సినిమాలో "వేర్ ఇస్ ద పార్టీ" పాటకు అద్భుతంగా నర్తించి అదరగొట్టింది. ఇటీవలి ఇంటర్వ్యూలో, ఊర్వశి తన కెరీర్ గురించి, భవిష్యత్తుపై తన ఆశలు, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.

ఇప్పటి వరకు తన కెరీర్‌తో సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తులో కూడా మంచి పాత్రలు వస్తాయని నమ్మకం ఉందని చెప్పింది. అలాగే మరిన్ని హిస్టారికల్, రొమాంటిక్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పింది. మోడలింగ్, నటనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడింది. మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మేయాలని, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చింది. తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని, ఆ నగరంతో తనకు మంచిది అనుబంధం ఉందని చెప్పింది.

భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే స్క్రిప్ట్‌లు బాగుండేలా జాగ్రత్తలు పడతానని ఆమె అన్నది. తనకు నటన అంటే ఇష్టమని, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పింది.  వెండితెరపై తానేమిటో నిరూపించుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అలాగే పెళ్లి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏడు వేర్వేరు ప్రదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే ఆశ తనకు ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ ఏడుసార్లు చేసుకునే పెళ్లిలలో బీచ్ వెడ్డింగ్, బెంగాలీ వెడ్డింగ్, ఒక క్రూయిజ్ వెడ్డింగ్, క్రైస్తవ వెడ్డింగ్, హిందూ వెడ్డింగ్, థీమ్-బేస్డ్ వెడ్డింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండాలని ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.

భర్త ఒక్కడైనా పెళ్లి మాత్రం ఇన్నిసార్లు, ఇన్ని ప్రదేశాల్లో చేసుకోవాలనే ఆమె కోరిక విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తెలివైన, ఫన్నీ, మంచి వ్యక్తిత్వం ఉన్న భర్త కోసం వెతుకుతున్నానని చెప్పింది. కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. బాలీవుడ్ సినిమాల్లో కూడా తన హాట్ నెస్ చూపిస్తూ అక్కడి ప్రేక్షకులకు మతిపోగొడుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>