EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/abn-rk14bd5b25-037d-4246-bf06-5bd21fb13ae7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/abn-rk14bd5b25-037d-4246-bf06-5bd21fb13ae7-415x250-IndiaHerald.jpgస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. చంద్రబాబును ఎప్పుడూ వెనకేసుకొచ్చే ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణ ఈ అంశంపై ఎడిటోరియల్ రాశారు. అయితే.. ఆయన కూడా చంద్రబాబు తప్పు చేయలేదు.. నిప్పు అని రాయలేదు. కేసులో టెక్నికల్ అంశాలనే ప్రస్తావించారు తప్ప.. చంద్రబాబు నిప్పు అని అనడం లేదు. మరి ఆర్కే ఏమంటున్నారంటే.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ను పర్యవేక్షించాల్సింది అవినీతి నిరోధక శాఖ మాత్రమేనట. సీఐడీ కాదట.. అందుకు ఉదాహరణగా ఇటీవల తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫాంహౌజabn rk{#}Telangana;Vemuri Radhakrishna;Andhra Jyothi;court;Fire;Andhra Pradesh;Anti-Corruption Bureau;police;CBNABN ఆర్కే.. బాబు చేసింది తప్పేనని ఒప్పుకున్నారా?ABN ఆర్కే.. బాబు చేసింది తప్పేనని ఒప్పుకున్నారా?abn rk{#}Telangana;Vemuri Radhakrishna;Andhra Jyothi;court;Fire;Andhra Pradesh;Anti-Corruption Bureau;police;CBNMon, 11 Sep 2023 21:42:00 GMTస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. చంద్రబాబును ఎప్పుడూ వెనకేసుకొచ్చే ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణ ఈ అంశంపై ఎడిటోరియల్ రాశారు. అయితే.. ఆయన కూడా చంద్రబాబు తప్పు చేయలేదు.. నిప్పు అని రాయలేదు. కేసులో టెక్నికల్ అంశాలనే ప్రస్తావించారు తప్ప.. చంద్రబాబు నిప్పు అని అనడం లేదు.


మరి ఆర్కే ఏమంటున్నారంటే.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ను పర్యవేక్షించాల్సింది అవినీతి నిరోధక శాఖ మాత్రమేనట. సీఐడీ కాదట.. అందుకు ఉదాహరణగా ఇటీవల తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫాంహౌజ్‌ కేసును ప్రస్తావించారు ఆర్కే. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నలుగురిని కొందరు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారని ఉప్పందుకున్న సైబరాబాద్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారని... వారిని విచారించి ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ కిందే అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ఆర్కే.


అయితే.. సైబరాబాద్‌ పోలీసుల ఈ అతి తెలివిని ప్రశ్నించిన తెలంగాణ ఏసీబీ కోర్టు మేజిస్ర్టేట్‌.. నిందితుల రిమాండ్‌ను తిరస్కరించారట. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ కింద ఏసీబీ కాకుండా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని మెజిస్ట్రేట్‌ అన్నారట. అందుకే  రిమాండ్‌ అభ్యర్థనను మేజిస్ర్టేట్‌ కొట్టి పారేశారట. ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ ఏపీ సీఐడీ అధికారులు అదే పొరపాటు చేశారని ఏబీఎన్‌ ఆర్కే రాసుకొచ్చారు.


కానీ.. ఆర్కే ఆశలు నెరవేరలేదు. చంద్రబాబు రిమాండ్‌ను ఏపీ ఏసీబీ కోర్టు కొట్టేయలేదు. రెండు వారాలపాటు రిమాండ్‌ విధించింది. పాపం.. ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్‌కు ఆ మాత్రం లాజిక్‌ తెలియలేదంటారా.. లేక మన ఏబీఎన్ ఆర్కే గారే సరిగ్గా రెండు కేసులను అర్థం చేసుకోలేకపోయారో తెలియదు కానీ.. మొత్తానికి ఆర్కే గారి జ్యోతిష్యం ఫలించలేదు. విచిత్రం ఏంటంటే.. చంద్రబాబు తప్పు చేయలేదని మాత్రం ఆర్కే ఎక్కడా ఘంటాపథంగా చెప్పడమే లేదు. దటీజ్‌ ఏబీఎన్‌ ఆర్కే.. అంతే కదా మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>