PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-chandrababu-modi578ec02e-3f44-4cb2-bf1c-be964144948a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-chandrababu-modi578ec02e-3f44-4cb2-bf1c-be964144948a-415x250-IndiaHerald.jpgఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధంలేదని అందరికీ తెలుసు. కానీ పవన్ కు మాత్రం ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపించిందేమో. అందుకనే పదేపదే జీ 20 సదస్సంటు గోలచేస్తున్నారు. జాతీయస్ధాయిలో పేరున్న చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయటం ఏమిటంటు మండిపోయారు. జాతీయస్ధాయిలో పేరుంటే మాత్రం కుంభకోణాల్లో ఇరుక్కున్న తర్వాత విచారించకూడదు, అరెస్టు చేయకూడదని ఏమన్నా చట్టముందా అన్నది అర్ధంకావటంలేదు. pawan chandrababu modi{#}Laloo Prasad Yadav;jayalalitha;CBI;Pawan Kalyan;Sugar;Jagan;CBN;Cinemaఅమరావతి : పవన్ కు ఆలోచనుందా ?అమరావతి : పవన్ కు ఆలోచనుందా ?pawan chandrababu modi{#}Laloo Prasad Yadav;jayalalitha;CBI;Pawan Kalyan;Sugar;Jagan;CBN;CinemaMon, 11 Sep 2023 09:00:00 GMT


జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాదన చాలా విచిత్రంగా ఉంది. ఆయన మీడియాతో మాట్లాడుతు జీ 20 సదస్సు జరుగుతున్న నేపధ్యంలో చంద్రబాబునాయుడును అరెస్టు చేయటం ఏమిటని మండిపోయారు. అసలు జీ 20 సదస్సుకు చంద్రబాబు అరెస్టుకు సంబంధం ఏమిటో అర్ధంకావటంలేదు. చంద్రబాబు ఏమన్నా జీ 20 సదస్సులో పాల్గొంటున్నారా ? లేకపోతే సదస్సును పర్యవేక్షిస్తున్నారా ?





ఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధంలేదని అందరికీ తెలుసు. కానీ పవన్ కు మాత్రం ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపించిందేమో. అందుకనే పదేపదే జీ 20 సదస్సంటు గోలచేస్తున్నారు. జాతీయస్ధాయిలో పేరున్న చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయటం ఏమిటంటు మండిపోయారు. జాతీయస్ధాయిలో పేరుంటే మాత్రం కుంభకోణాల్లో ఇరుక్కున్న తర్వాత విచారించకూడదు, అరెస్టు చేయకూడదని ఏమన్నా చట్టముందా అన్నది అర్ధంకావటంలేదు.





లాలూప్రసాద్ యాదవ్, జయలలిత, శిబుసోరేన్ ముఖ్యమంత్రులుగా ఉన్నపుడే అరెస్టయిన విషయం పవన్ కు తెలీదేమో. చంద్రబాబుకు మించి జాతీయరాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్  చక్రంతిప్పిన రోజులున్నాయి. దాణా కుంభకోణంలో సీబీఐ విచారించలేదా ? అరెస్టు చేయలేదా ? జైలుశిక్ష పడలేదా ?  చైన్నైలో కూర్చుని జయలలిత కూడా ఒకపుడు జాతీయ రాజకీయాలను శాసించిన విషయం పవన్ కు తెలీదేమో. అలాంటి జయకే  కేసులు, విచారణ, జైలుజీవితం తప్పలేదు. వాళ్ళతో పోల్చుకుంటే జాతీయస్ధాయిలో చంద్రబాబు ఇమేజి తక్కువనే చెప్పాలి.





అయినా ఇక్కడ గమనించాల్సింది కుంభకోణం జరిగిందా లేదా ? చంద్రబాబు పాత్రుందా లేదా ? అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అనిమాత్రమే. అంతేకానీ 74 ఏళ్ళ వయసు, బీపీ, షుగర్ ఉందని, జాతీయస్ధాయిలో పేరున్న వ్యక్తన్న పవన్ వాదనలో డొల్లతనం బయడపడింది. చంద్రబాబును అరెస్టుచేస్తారని తాను అస్సలు ఊహించలేదట. తాను ఊహించినట్లే అంతా జరుగుతుందని అనుకోవటమే పవన్ అమాయకత్వం. రాజకీయాలంటే సినిమా షూటింగ్ కాదన్న విషయం ఇప్పటికైనా పవన్ గ్రహిస్తే మంచిది. ఇక జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పదేపదే నేరస్ధుడు, నేరస్ధుడంటు పవన్ చెప్పటంలోనే జగన్ అంటే ఉన్న కసంతా బయటపడింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రకుల్ కారు కొనలేదట.. ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>