Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyaa5116383-133e-400d-b16e-171c3a7fff8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyaa5116383-133e-400d-b16e-171c3a7fff8a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే స్టార్ హీరోగా హవా నడిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ బాలయ్య క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఎంతో మంది హీరోలు ఉన్నా.. బాలయ్యకు మాత్రం అటు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా బాలయ్య సినిమాలంటే చాలు మాస్ ప్రేక్షకులు అందరికి కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. Balayya{#}Balakrishna;Nagma;Sharada;Vijayashanti;jayaprada;jayasudha;Roja;Amaravati;Navaneet Kaur;cinema theater;lion;Heroine;TDP;Mass;Yevaru;Maharathi;Partyఒకప్పుడు బాలయ్యతో నటించి.. రాజకీయాల్లో రాణించిన హీరోయిన్లు వీళ్లే?ఒకప్పుడు బాలయ్యతో నటించి.. రాజకీయాల్లో రాణించిన హీరోయిన్లు వీళ్లే?Balayya{#}Balakrishna;Nagma;Sharada;Vijayashanti;jayaprada;jayasudha;Roja;Amaravati;Navaneet Kaur;cinema theater;lion;Heroine;TDP;Mass;Yevaru;Maharathi;PartyMon, 11 Sep 2023 19:45:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే స్టార్ హీరోగా హవా నడిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ బాలయ్య క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఎంతో మంది హీరోలు ఉన్నా.. బాలయ్యకు మాత్రం అటు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా బాలయ్య సినిమాలంటే చాలు మాస్ ప్రేక్షకులు అందరికి కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి.


 బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ లు చెబుతూ ఉంటే  థియేటర్ మొత్తం విజిల్స్ తో మారుమోగిపోతూ ఉంటుంది. అందరూ సరికొత్త కాన్సెప్ట్లతో కూడిన సినిమాలు చేస్తుంటే.. బాలయ్య మాత్రం ఇప్పటికీ కూడా తనకు సెట్ అయ్యే మాస్ యాక్షన్ సినిమాలతోనే సూపర్ హిట్ లు కొడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇప్పుడు యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు వందకు పైగా సినిమాలలో నటించారు. ఇక ఆయా సినిమాలలో ఎంతో మంది హీరోయిన్స్ బాలయ్యతో జత కట్టారు అని చెప్పాలి  అయితే ఇలా బాలయ్య సరసన నటించిన హీరోయిన్లలో ఎవరు ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకప్పుడు బాలయ్య తో నటించి ఎన్నో సూపర్హిట్ లు అందుకున్న విజయశాంతి మెదక్ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు బిజెపిలో ఉన్నారు .  అయితే మహారధి సినిమాలో నటించిన నవనీత్ కౌర్ ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచారు  ఇక మరో సీనియర్ నటిమని శారద తెనాలి నుంచి టిడిపి తరఫున ఎంపీగా గెలిచారు. బాలయ్యతో కొన్ని సినిమాల్లో జతకట్టిన జయసుధ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే బాలయ్యతో నటించిన జయప్రద యూపీలోని రామపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఇక బాలయ్య కు పర్ఫెక్ట్ జోడిగా పేరు సంపాదించుకున్న నగ్మా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక బాలయ్యతో నటించిన రోజా ఏపీలో ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>