MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4fe0444b-89ca-4379-8450-4639521d763d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4fe0444b-89ca-4379-8450-4639521d763d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంది నటి అనిత చౌదరి. యాంకర్ గా తన కెరియర్ను ప్రారంభించిన ఆమె దాని తర్వాత చాలామంది ఆగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. అప్పట్లో ఉదయభాను, సుమ, ఝాన్సీ, శిల్పా లాంటి వాళ్లు యాంకర్స్ గా బుల్లితెరను ఏలుతున్న సమయంలోనే అనిత చౌదరి కూడా యాంకర్ గా రాణించారు. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే సీరియల్స్ లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కస్తూరి, ఋతురాగాలు వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి పాపులారిటీ tollywood{#}anitha singer;kasthuri;shilpa;American Samoa;Driver;Accident;Husband;Car;Balakrishna;Cinemaడ్రైవర్ వల్ల నాకు యాక్సిడెంట్ అయ్యింది - బాలకృష్ణ గారే దగ్గురుండి చూసుకున్నారు : అనితా చౌదరిడ్రైవర్ వల్ల నాకు యాక్సిడెంట్ అయ్యింది - బాలకృష్ణ గారే దగ్గురుండి చూసుకున్నారు : అనితా చౌదరిtollywood{#}anitha singer;kasthuri;shilpa;American Samoa;Driver;Accident;Husband;Car;Balakrishna;CinemaMon, 11 Sep 2023 21:20:00 GMTఅనిత చౌదరి. యాంకర్ గా తన కెరియర్ను ప్రారంభించిన ఆమె దాని తర్వాత చాలామంది ఆగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. అప్పట్లో ఉదయభాను, సుమ, ఝాన్సీ, శిల్పా లాంటి వాళ్లు యాంకర్స్ గా బుల్లితెరను ఏలుతున్న సమయంలోనే అనిత చౌదరి కూడా యాంకర్ గా రాణించారు. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే సీరియల్స్ లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కస్తూరి, ఋతురాగాలు వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

 ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 'రాజా', 'మురారి', 'నువ్వే నువ్వే', 'ఉయ్యాల జంపాల', 'గురు', 'నిర్మలా కాన్వెంట్', 'మెంటల్ మదిలో', 'చత్రపతి', 'మన్మధుడు' వంటి సినిమాలతో నటిగా ఆకట్టుకున్నారు. అలాంటి అనిత చౌదరి తన నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు అనిత చౌదరి. తన జీవితంలో ఎన్నో ఆక్సిడెంట్ జరిగాయని ఈ సందర్భంగా చెప్పారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో అనిత చౌదరి మాట్లాడుతూ.." నా జీవితంలో రెండు మేజర్ యాక్సిడెంట్ జరిగాయి. అందులో మొదటిసారి అమెరికా వెళుతున్న సమయంలో ఆక్సిడెంట్ జరిగింది. 

అప్పుడు కస్తూరి సీరియల్ లో నా నటన మెచ్చుకొని సన్మానం చేసేందుకు ఆహ్వానించారు. ఆ టైంలో హోటల్ కి కార్ లో వస్తుండగా డ్రైవర్ ఫోన్  పడిపోయిందిని కిందికి వంగడంతో ఎదురుగా ట్రక్ వచ్చి గుద్దింది.  అలా డ్రైవర్ పొరపాటు వల్ల నా కాలర్ బోన్ విరిగిపోయి కుట్లు కూడా పడ్డాయి ఆ తర్వాత కేరింత మూవీ టైం లో మరో ఆక్సిడెంట్ అయింది. ఆ ఆక్సిడెంట్ లో నా డిస్క్ విరిగింది.  అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందామని అనుకున్నా. కానీ నాకు ఒక అభిమాని ఉంది. తను బాలకృష్ణ గారికి చాలా క్లోజ్.  బాలకృష్ణ గారికి నా ఆక్సిడెంట్ గురించి చెప్పింది. అప్పుడు బాలకృష్ణ గారు వెంటనే స్పందించి ఆయనే స్వయంగా హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ హాస్పిటల్ నుండి డాక్టర్స్ తీసుకొచ్చి, మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి నా భర్త అమెరికాలో ఉంటే ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పి నాకు ట్రీట్మెంట్ చేయించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>