Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunny394eb01d-b1fc-4fb7-8b20-ae3ea5da2237-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunny394eb01d-b1fc-4fb7-8b20-ae3ea5da2237-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇలాగే సెన్సేషన్ సృష్టించింది గదర్ 2 సినిమా బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధానోపాత్రలో నటించిన గద్దర్ 2 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు దాటిన ఇంకా వసూళ్ల సునామి తగ్గలేదు అని చెప్పాలి. ఈ మూవీ అటు నిర్మాతలు అందరికీ కూడా భారీగా లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాతో సన్నీ డియోల్ కి కూSunny{#}Sunny Deol;producer;Producer;Box office;Tsunami;Pakistan;bollywood;Cinemaగదర్ -2 లో రెమ్యూనరేషన్ పై.. సన్నీ డియోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?గదర్ -2 లో రెమ్యూనరేషన్ పై.. సన్నీ డియోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Sunny{#}Sunny Deol;producer;Producer;Box office;Tsunami;Pakistan;bollywood;CinemaMon, 11 Sep 2023 10:50:00 GMTఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇలాగే సెన్సేషన్ సృష్టించింది గదర్ 2 సినిమా  బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధానోపాత్రలో నటించిన గద్దర్ 2 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు దాటిన ఇంకా వసూళ్ల సునామి తగ్గలేదు అని చెప్పాలి. ఈ మూవీ అటు నిర్మాతలు అందరికీ కూడా భారీగా లాభాలు తెచ్చి పెట్టింది.


 ఇక ఈ సినిమాతో సన్నీ డియోల్ కి కూడా ఊహించని రీతిలో మంచి గుర్తింపు వచ్చింది. కాగా పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పాలి. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతుంది. అయితే ఇక గదర్ 2 సినిమాలో తన రెమ్యూనరేషన్ గురించి ఇటీవలే సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద గద్దర్ 2 సినిమా వసూళ్లలో రికార్డులు సృష్టించడంతో.. తన రెమ్యూనరేషన్ 50 కోట్లకు పెంచారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై స్వయంగా సన్నీ డియోల్ స్పందించాడు.


 తాను కేవలం డబ్బు కోసమే సినిమాలు చేయను అంటూ చెప్పుకొచ్చాడు. నటుడికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అనేది.. తాము ఆ మూవీ ద్వారా ఎంత సంపాదిస్తామని దాన్ని బట్టి.. నిర్మాతలు నిర్ణయిస్తారు అంటూ సన్నీ డియోల్ చెప్పుకొచ్చాడు. ప్రొడ్యూసర్ తనకు అంత మొత్తం ఇవ్వచ్చు అనుకుంటే తనకు అంగీకారమేనని తెలిపాడు. అయితే తాను నిర్దిష్ట మొత్తం ఇవ్వలేదని ఏ ప్రాజెక్టును నిరాకరించలేదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేశాడు. తాను డబ్బు కోసం పని చేయనని.. ప్రాజెక్టుకు తాను భారం కాదలుచుకోను అంటూ  స్పష్టం చేశాడు. కాగా గదర్ 2 సినిమా ఎంతో వేగంగా 450 కోట్లు వసూళ్లు సాధించిన మూవీగా అరుదైన రికార్డును కూడా సృష్టించింది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రకుల్ కారు కొనలేదట.. ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>