Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni997a8a7a-28e9-4284-9f6e-5b77fbbf1434-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni997a8a7a-28e9-4284-9f6e-5b77fbbf1434-415x250-IndiaHerald.jpgప్రపంచ కప్ 2019 టోర్నమెంట్లో ఇండియా గెలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే వరుస విజయాలతో దూసుకుపోతూ టేబుల్ టాపర్‌గా నిలిచింది టీమిండియా. సెమీఫైనల్స్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో ఈజీగా మన దేశం గెలుస్తుందని అభిమానులు అనుకున్నారు కానీ చివరిలో 18 పరుగులు తేడాతో ఇండియా పరాజయం పాలయ్యింది. దీనంతటికీ కారణం ధోనీ ఆ మ్యాచ్ రనౌట్ కావడమే. అతను రనౌట్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోయేది టీమిండియా వరల్డ్ కప్ కూడా గెలిచేదేమో. కానీ చిన్న పొరపాటు చేసి ధోనీ వరల్డ్ కప్ చేజార్చేలా చేశాడు. వాస్Dhoni{#}MS Dhoni;Hanu Raghavapudi;India;World Cup;Kollu Ravindra;Ravindra Jadeja;Audi;Athadu;James Cameronనాలుగేళ్ళైనా ఇంకా.. ధోని ఆ రనౌట్ బాధ పడ్తున్నాడంట తెలుసా?నాలుగేళ్ళైనా ఇంకా.. ధోని ఆ రనౌట్ బాధ పడ్తున్నాడంట తెలుసా?Dhoni{#}MS Dhoni;Hanu Raghavapudi;India;World Cup;Kollu Ravindra;Ravindra Jadeja;Audi;Athadu;James CameronMon, 11 Sep 2023 19:03:00 GMTప్రపంచ కప్ 2019 టోర్నమెంట్లో ఇండియా గెలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే వరుస విజయాలతో దూసుకుపోతూ టేబుల్ టాపర్‌గా నిలిచింది టీమిండియా. సెమీఫైనల్స్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో ఈజీగా మన దేశం గెలుస్తుందని అభిమానులు అనుకున్నారు కానీ చివరిలో 18 పరుగులు తేడాతో ఇండియా పరాజయం పాలయ్యింది. దీనంతటికీ కారణం ధోనీ ఆ మ్యాచ్ రనౌట్ కావడమే. అతను రనౌట్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోయేది టీమిండియా వరల్డ్ కప్ కూడా గెలిచేదేమో. కానీ చిన్న పొరపాటు చేసి ధోనీ వరల్డ్ కప్ చేజార్చేలా చేశాడు.

వాస్తవానికి ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ టీమ్‌కి కొంచెం కూడా కాంట్రిబ్యూషన్ అందించలేదు. టీమిండియా 90 రెండు పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయింది. ఇక ఈ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకోవడమేనని అభిమానులు నిరాశ పడిపోయారు. అప్పుడే రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ బాగా ఆడటం మొదలుపెట్టారు. దాంతో అభిమానుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. జడేజా, ధోని కలిసి ఏడో వికెట్ కి 116 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు. 59 బాల్స్ లో నాలుగు ఫ్లోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి మొత్తంగా 72 పరుగులు చేసిన జడేజా ఒక బ్యాడ్ బాల్ కి దొరికిపోయాడు. అతను ఔట్ అయిన కొద్దిసేపటికి ధోని రనౌట్ అయ్యాడు.

మొత్తం 72 బంతులు ఆడి ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టిన ధోనీ 50 పరుగులు చేశాడు. అదే అతడికి లాస్ట్ ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ అవుతుందని ఫ్యాన్స్ ఊహించలేకపోయారు. రనౌట్ తోనే మొదలైన ఈ కెప్టెన్ కూల్ కెరీర్ రనౌట్ తోనే ముగిసింది. ఇప్పటికీ ఈ మూమెంట్ గురించి ఆలోచిస్తే చాలామంది ఫాన్స్ ఎమోషనల్ అవుతుంటారు అలాగే ధోనీ చేసిన తప్పును కూడా ఎత్తి చూపుతుంటారు. ఆ తప్పేంటో ధోనీ తనకు చెప్పినట్లు స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందర్ వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు ధోనీ తనకేం చెప్పాడో వివరించాడు.

ఆయన ప్రకారం ధోనీ ఏం చెప్పాడంటే... "జస్ట్ సింగిల్ ఇంచ్, ఆ సింగిల్ నుంచి ఇప్పటికీ నన్ను బాధ పెడుతుంది. ఆ రోజు వరల్డ్ కప్ మ్యాచ్‌లో నేను డైవ్ చేసి ఉంటే బాగుండేది. మార్టిన్ గప్టిల్ బంతిని విసిరేయడం నేను చూశాను. డైవ్‌ చేయాలనిపించింది కానీ ఫాస్ట్ గా పరిగెడుతుంటే అవసరం లేదనిపించింది. ఈజీగా క్రీజ్ లోకి వచ్చేస్తాను అనుకున్నా. కానీ అది డైరెక్ట్ త్రో అవ్వడంతో ఔట్ కావలసి వచ్చింది. ఈ మ్యాచ్ నాకు చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని తెలుసు. అందుకే ఔట్ అయ్యి వెళ్లిపోయేటప్పుడు 'మొదటి మ్యాచ్‌లో రన్‌ ఔటయ్యా, లాస్ట్ మ్యాచ్‌ కూడా రనౌట్ అయ్యా' అనే ఆలోచన నా మైండ్‌లో మెదిలింది. ఒకవేళ ఔట్ కాకపోయి ఉంటే జేమ్స్ నీశమ్‌ వేసే ఆఖరి ఓవర్లో సులభంగా మూడు సిక్సర్లు కొట్టేవాణ్ణి. ఇండియా గెలిచేది." అని బాగా బాధపడ్డాడు.

ఈ వరల్డ్ కప్పు జరిగిన ధోని ఆ రనౌట్ గురించే బాధపడటం చూస్తుంటే టీమిండియా గెలుపు కోసం అనుక్షణం ధోనీ తపనపడ్డాడని అర్థమవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>