Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/lift754f6e11-1ad6-4b09-b751-fb53095de375-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/lift754f6e11-1ad6-4b09-b751-fb53095de375-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్న మనిషి.. అన్ని పనులను కూడా సులభంగా చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఒకప్పుడు ఎత్తైన భవనాల మీదికి ఎక్కాలి అంటే కేవలం మెట్ల ద్వారా మాత్రమే పైకి వెళ్లేవారు అందరూ. కానీ ఇప్పుడు ఏకంగా లిఫ్టులు వాడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే లిఫ్టులు వాడటం చేసేవారు. కానీ ఇప్పుడు పెద్ద భవనాల దగ్గర నుంచి చిన్న భవనాల వరకు ప్రతి ఒక్కరు కూడా లిఫ్ట్ వినియోగిస్తూLift{#}Yevaruసడన్గా లిఫ్ట్ ఆగిపోతే.. కంగారు పడకుండా.. ఏం చేయాలో తెలుసా?సడన్గా లిఫ్ట్ ఆగిపోతే.. కంగారు పడకుండా.. ఏం చేయాలో తెలుసా?Lift{#}YevaruMon, 11 Sep 2023 11:15:00 GMTఇటీవల కాలంలో టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్న మనిషి.. అన్ని పనులను కూడా సులభంగా చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఒకప్పుడు ఎత్తైన భవనాల మీదికి ఎక్కాలి అంటే కేవలం మెట్ల ద్వారా మాత్రమే పైకి వెళ్లేవారు అందరూ. కానీ ఇప్పుడు ఏకంగా లిఫ్టులు వాడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే లిఫ్టులు వాడటం చేసేవారు. కానీ ఇప్పుడు పెద్ద భవనాల దగ్గర నుంచి చిన్న భవనాల వరకు ప్రతి ఒక్కరు కూడా లిఫ్ట్ వినియోగిస్తూ ఉన్నారు. సామాన్యులు కూడా తమ ఇళ్లల్లో లిఫ్ట్ ను పెట్టుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం.



 అయితే ఇటీవల కాలంలో లిఫ్ట్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో యువకుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరు మెట్లు ఎక్కడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అదే సమయంలో ఇక ఇటీవల కాలంలో పది, 15 ఫ్లోర్ల భవనాలే ప్రతి చోట కనిపిస్తూ ఉండడంతో అన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కడానికి కూడా కాస్త భయపడిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లిఫ్ట్ వాడకం మరింత పెరిగిపోయింది. అయితే కొన్ని కొన్ని సార్లు లిఫ్టుల్లో ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా సాంకేతిక సమస్యలు ఏర్పడి లిఫ్టులు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓవర్ లోడ్ అయితే కేబుల్స్ విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.


 ఇలా లిఫ్ట్ ఆగిపోయినప్పుడు అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి ఇలా లిఫ్ట్ ఆగిపోయినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. లిఫ్ట్ ఆగిపోయినప్పుడు తెలియకుండా అందులో ఉన్న లైట్స్ ఆన్ లేదా ఆఫ్ చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో స్టాక్ బటన్ ఉపయోగించాలీ. కంగారు పడకుండా అలారం బటన్ నొక్కితే క్షణాల్లో సహాయం అందుతుంది. బలవంతంగా లిఫ్ట్ తలుపు తెరవడానికి ప్రయత్నించకూడదు. మూసుకుంటున్న లిఫ్టు తలుపులను చేతులు పెట్టి ఆపడానికి ప్రయత్నిస్తే చివరికి సెన్సార్ పని చేయకపోతే చేతులు మధ్యలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఇక పిల్లలతో లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు వారు ఎలాంటి బట్టన్ లు నొక్కకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రకుల్ కారు కొనలేదట.. ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>