EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrbabu55f931d3-550b-448f-ab41-b430d0df7ec2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrbabu55f931d3-550b-448f-ab41-b430d0df7ec2-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఆయువు పట్టు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీఆర్ అయినా దాన్ని కష్ట సమయంలో నిలబెట్టింది మాత్రం చంద్రబాబు నాయుడు అని అంటారు. ఎన్టీఆర్ పార్టీ బలోపేతం చేసే విషయం కన్నా తన వ్యక్తిగత ఇమేజ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు అని అంటారు. 1985లో నాదెండ్ల భాస్కరరావు ఇష్యూ వల్లే ఎన్టీఆర్ విజయం సాధించారని లేకపోతే అప్పటి ఎన్నికల్లో ఓడిపోయే వారని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఐదేళ్లు తిరిగేసరికి అనుకున్నట్టుగానే ఆయన ఓడిపోయారని వాళ్లు అంటున్నారు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలికి, CHANDRBABU{#}NTR;ramoji rao;Kanna Lakshminarayana;Nadendla Bhaskara Rao;TDP;Telugu Desam Party;CBNఔనా.. పక్కా ప్లాన్‌తోనే చంద్రబాబు జైలుకు వెళ్లారా?ఔనా.. పక్కా ప్లాన్‌తోనే చంద్రబాబు జైలుకు వెళ్లారా?CHANDRBABU{#}NTR;ramoji rao;Kanna Lakshminarayana;Nadendla Bhaskara Rao;TDP;Telugu Desam Party;CBNMon, 11 Sep 2023 05:00:00 GMTతెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఆయువు పట్టు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీఆర్ అయినా దాన్ని కష్ట సమయంలో నిలబెట్టింది మాత్రం చంద్రబాబు నాయుడు అని అంటారు. ఎన్టీఆర్ పార్టీ బలోపేతం చేసే విషయం కన్నా తన వ్యక్తిగత ఇమేజ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు అని అంటారు. 1985లో నాదెండ్ల భాస్కరరావు ఇష్యూ వల్లే ఎన్టీఆర్ విజయం సాధించారని లేకపోతే అప్పటి ఎన్నికల్లో ఓడిపోయే వారని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఐదేళ్లు తిరిగేసరికి అనుకున్నట్టుగానే ఆయన ఓడిపోయారని వాళ్లు అంటున్నారు.


ఎందుకంటే ఆయన వ్యవహార శైలికి, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి మధ్య తేడా ఉంటుందని వాళ్లు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడంతో  చంద్రబాబు నాయుడు రామోజీరావు వీళ్ళందరూ కూడా పార్టీకి ఏమవుతుందో అని భయపడ్డారని అంటారు. ప్రతిపక్షంలో ఉండగా ఇటువంటి వివాహం చేసుకోవడం అనేది కరెక్టా అని అప్పుడు పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో పాటు చంద్రబాబు, రామోజీరావు వీళ్ళందరూ భావించారని చెబుతారు.  


అప్పటికి ఆయనకి నచ్చచెప్పి చూసారు. అయినా కూడా వినకపోవడంతో 94లో సీనియర్ నేతలు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపి ఆయనను తెలుగుదేశం పార్టీ నేతగా నిలబెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అపర చాణుక్యుడు చంద్రబాబు నాయుడు అని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే  ఆయనను అరెస్టు చేస్తారని ఆయనకు ముందే తెలిసిన కూడా ఆయన ఏమీ తెలియనట్టు ఉండిపోయారు.


మీడియాలో హైప్ రావాలని, జనాల్లో చర్చ జరగాలని ఆయన ఆ విధంగా సైలెంట్ గా ఉండిపోయారన్న వాదన వినిపిస్తోంది.  లేదంటే టిడిపి శ్రేణులు, అభిమానులు రాత్రికి రాత్రే హడావుడి సృష్టిస్తారని, అలా జరగకూడదని ఆయన భావించారు. అంతే కాకుండా ఆయన రావడానికి హెలికాప్టర్ ని పంపిస్తామంటే ఆయన కాదని బస్సులోనే  అంత దూరం వచ్చారు. ఇదంతా కూడా  టిడిపిపై సానుభూతి కోసం అదే  సమయంలో వైసీపీపై ద్వేషం కలగాలని ఆయన అలా చేశారని కొందరు భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : చంద్రబాబు రూటే సపరేటా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>