PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/srinivas-pardasani-chandrababu089249c4-f54c-44a1-8c1f-d36bce94964a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/srinivas-pardasani-chandrababu089249c4-f54c-44a1-8c1f-d36bce94964a-415x250-IndiaHerald.jpgఅయితే ఈ ఎపిసోడ్ లో కీలక మలుపు ఏమిటంటే పర్దాసాని, శ్రీనివాస్ ఇద్దరు విదేశాలకు పారిపోయారు. ఈనెల 5వ తేదీన పర్దాసాని దుబాయ్ కి, శ్రీనివాస్ 6వ తేదీన అమెరికాకు పారిపోయారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు పారిపోయారో అందరు చంద్రబాబునే అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు సీఐడీ విచారణకు హాజరై వాస్తవాలు చెప్పేస్తే ఇరుక్కునేది చంద్రబాబే కాబట్టి. చంద్రబాబు దగ్గరే శ్రీనివాస్ ముందు పీఏగా తర్వాత పీఎస్ గా చాలాకాలం పనిచేశారు. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు శ్రీనివాసే పీఎస్ గా కొంతకాలం పనిచేశారు. srinivas pardasani chandrababu{#}yogesh;Dubai;srinivas;Amaravati;Episode;CBNఅమరావతి : చంద్రబాబే ఆ ఇద్దరినీ తప్పించారా ?అమరావతి : చంద్రబాబే ఆ ఇద్దరినీ తప్పించారా ?srinivas pardasani chandrababu{#}yogesh;Dubai;srinivas;Amaravati;Episode;CBNSun, 10 Sep 2023 05:00:00 GMT


అందరికీ చంద్రబాబునాయుడు మీదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే అమరావతి రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటి శాఖ నిర్ధారించింది. ముడుపులు అందుకున్నారు కాబట్టి విచారణకు హాజరుకమ్మని నోటీసులు ఇస్తున్నా అడ్డదిడ్డమైన సమాధానాలిస్తున్నారు. పోయిన నెలలో విచారణకు రావాలని షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం వెలుగుచూడటంతో చంద్రబాబు పై ట్రోలింగ్స్ పెరిగిపోతున్నాయి.





అమరావతి ముడుపులు అందుకున్నది పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అయితే ఇచ్చింది మనోజ్ వాసుదేవ్ పర్దాసాని. ఇక ఇప్పటికే రు. 371 కోట్ల  స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కూడా యోగేష్ బాబు ముడుపులు ఇస్తే తీసుకున్నది పెండ్యాల శ్రీనివాసే. అంటే రెండు కుంభకోణాల్లోను చంద్రబాబు తరపున ముడుపులు అందుకున్నది శ్రీనివాసే కాబట్టి పై ముగ్గురిని విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.





అయితే ఈ ఎపిసోడ్ లో కీలక మలుపు ఏమిటంటే పర్దాసాని, శ్రీనివాస్ ఇద్దరు విదేశాలకు పారిపోయారు. ఈనెల 5వ తేదీన పర్దాసాని దుబాయ్ కి, శ్రీనివాస్ 6వ తేదీన అమెరికాకు పారిపోయారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు పారిపోయారో  అందరు చంద్రబాబునే అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు సీఐడీ విచారణకు హాజరై వాస్తవాలు చెప్పేస్తే ఇరుక్కునేది చంద్రబాబే కాబట్టి.  చంద్రబాబు దగ్గరే శ్రీనివాస్ ముందు పీఏగా తర్వాత పీఎస్ గా చాలాకాలం పనిచేశారు. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు శ్రీనివాసే పీఎస్ గా కొంతకాలం పనిచేశారు.





మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లే చంద్రబాబు గుట్టుమట్లన్నీ శ్రీనివాస్ చేతిలో ఉండుంటాయని అందరు నమ్ముతున్నారు. అందుకనే వీళ్ళిద్దరు సీఐడీ విచారణకు హాజరు కాకుండా దేశందాటి పోవటం వెనుక చంద్రబాబే ఉన్నారని అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ సీఐడీ తప్పుకూడా ఉంది. విదేశాలకు వెళ్ళగలిగే కెపాసిటి ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారణకు పిలిచినపుడు ముందుజాగ్రత్తగా పాస్ పోర్టులు తీసుకోకపోవటం సీఐడీ తప్పే. అలాగే ఎయిర్ పోర్టులను అలర్టు చేయకపోవటంలో సీఐడీ నిర్లక్ష్యం బయటపడింది. మరి వీళ్ళిద్దరు విదేశాలకు పారిపోయిన నేపధ్యంలో సీఐడీ ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది.   




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : చంద్రబాబే ఆ ఇద్దరినీ తప్పించారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>