Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icca7bf5fd6-49db-4e61-92d9-e7772f2fa05d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icca7bf5fd6-49db-4e61-92d9-e7772f2fa05d-415x250-IndiaHerald.jpgఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని కాలికి గాయం కావడంతో మిగిలిన టోర్నీకి దూరమయ్యాడు. అతను ఏప్రిల్ నుంచి రికవరీ కే పరిమితమయ్యాడు. అయితే, అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని రీసెంట్ రిపోర్ట్స్‌ ప్రకారం తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచ కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సమర్థవంతమైన వైద్య నిపుణుల బృందం సహాయంతో కేన్ చాలా కోలుకున్నాడని హెడ్ కోచ్ గ్యారీ Icc{#}New Zealand;World Cup;November;October;Athadu;Hanu Raghavapudi;Hyderabad;Indian;Newsఎక్కడ గాయపడ్డాడో.. అక్కడే కప్ గెలిచేందుకు వస్తున్నాడు?ఎక్కడ గాయపడ్డాడో.. అక్కడే కప్ గెలిచేందుకు వస్తున్నాడు?Icc{#}New Zealand;World Cup;November;October;Athadu;Hanu Raghavapudi;Hyderabad;Indian;NewsSun, 10 Sep 2023 18:15:00 GMTఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని కాలికి గాయం కావడంతో మిగిలిన టోర్నీకి దూరమయ్యాడు. అతను ఏప్రిల్ నుంచి రికవరీ కే పరిమితమయ్యాడు. అయితే, అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని రీసెంట్ రిపోర్ట్స్‌ ప్రకారం తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచ కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సమర్థవంతమైన వైద్య నిపుణుల బృందం సహాయంతో కేన్ చాలా కోలుకున్నాడని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పారు.

"మంచి ఫిట్నెస్ సాధించి క్రికెట్‌ ఆడాలనే కోరికతో కేన్ విలియమ్సన్ చాలా డెడికేషన్ పెట్టి మరీ కోలుకున్నాడు. అతడిని ఎంపిక చేసే స్థానంలో ఉన్నందుకు మేము గర్విస్తున్నాం." అని హెడ్ కోచ్ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. అతడు పూర్తిగా కోలుకునే వరకు వెయిట్ చేస్తామని, వరల్డ్ కప్ చిన్న టోర్నమెంట్ ఏమీ కాదని, ఇది అయిపోయేంత వరకు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని కోచ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే, కేన్ విలియమ్సన్ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్‌తో ఆడేందుకు తగినంత ఫిట్‌గా ఉండకపోవచ్చు.

విలియమ్సన్ భారతీయ అభిమానులలో, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం అతను నాలుగు సీజన్లు ఆడాడు. ఆయనను అభిమానులు ముద్దుగా "కేన్ మామ" అని పిలుస్తారు. న్యూజిలాండ్ 2015, 2019 ODI ప్రపంచ కప్‌లలో ఫైనల్స్‌కు చేరుకుంది, అయితే రెండు సార్లు ఓడిపోయింది. ఈసారి కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టోర్నమెంట్ అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ భారతదేశంలోని అహ్మదాబాద్‌లో జరుగుతుంది.

విలియమ్సన్‌కు 33 ఏళ్లు కాగా ఇదే అతడికి చివరి వన్డే ప్రపంచకప్. ఐపీఎల్‌లో గాయపడిన అహ్మదాబాద్‌లో కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్నానని చెప్పాడు. కాగా ప్రపంచకప్‌లో భారత అభిమానులు టీమ్ ఇండియా, న్యూజిలాండ్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలుకు బాబు: ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>