Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/surya0d5e3aed-e91b-4d29-b21e-d9cab28b1e34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/surya0d5e3aed-e91b-4d29-b21e-d9cab28b1e34-415x250-IndiaHerald.jpgప్రపంచకప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కడం పట్ల ప్రముఖ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సంతోషం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ T20 క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు, కానీ అతను వన్డే ఇంటర్నేషనల్స్ (ODIలు)లో అంతగా రాణించలేకపోయాడు. 24 ODI మ్యాచ్‌లలో, అతను కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. 24.33 సగటుతో ఉన్నాడు, ఇది గొప్ప పర్ఫామెన్స్ కాదని అతను స్వయంగా అంగీకరించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో మరింత మెరుగ్గా రాణించాలంటే సూర్యకుమార్ తన మైండ్‌సెట్‌ను కొంచెం సర్దుబాటు చేసుకోవాలని సౌత్ ఆSurya{#}Cricket;Audi;West Indies;World Cup;Sanju Samson;ICC T20;Athadu;Santosham;South Africaవన్ డే ఫార్మాట్‌లో మెరుగ్గా సూర్య రానించాలంటే.. అలా చేయాలంటున్న ఏబీ డివిలియర్స్?వన్ డే ఫార్మాట్‌లో మెరుగ్గా సూర్య రానించాలంటే.. అలా చేయాలంటున్న ఏబీ డివిలియర్స్?Surya{#}Cricket;Audi;West Indies;World Cup;Sanju Samson;ICC T20;Athadu;Santosham;South AfricaSun, 10 Sep 2023 18:30:00 GMTప్రపంచకప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కడం పట్ల ప్రముఖ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సంతోషం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ t20 క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు, కానీ అతను వన్డే ఇంటర్నేషనల్స్ (ODIలు)లో అంతగా రాణించలేకపోయాడు. 24 ODI మ్యాచ్‌లలో, అతను కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. 24.33 సగటుతో ఉన్నాడు, ఇది గొప్ప పర్ఫామెన్స్ కాదని అతను స్వయంగా అంగీకరించాడు.

50 ఓవర్ల ఫార్మాట్‌లో మరింత మెరుగ్గా రాణించాలంటే సూర్యకుమార్ తన మైండ్‌సెట్‌ను కొంచెం సర్దుబాటు చేసుకోవాలని సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. "నేను సూర్యకుమార్ ఆటతీరుకు అభిమానిని, అతడి స్టైల్ నా తరహాలోనే ఉంటుంద"ని డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్ లో సూర్యకుమార్ ఇప్పటిదాకా అంతగా రాణించలేదని, వన్డేల్లో మెరుగ్గా రాణించాలంటే సూర్యకుమార్ తన ఆలోచనలో చిన్న మార్పు చేసుకోవాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లలో మొదట ఆడటానికి అతనికి ఛాన్స్ రాకపోయినా తర్వాత వచ్చే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

భారత జట్టు 2011లో ఎలా ధైర్యంగా ఆడి గెలిచిందో అదే విధంగా 2023 ప్రపంచ కప్‌లో కూడా నిర్భయంగా ఆడాలని డివిలియర్స్ చెబుతున్నాడు. భారత్‌కు బలమైన జట్టు ఉందని, అయితే స్వదేశంలో ఆడటం వల్ల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అతను తెలిపాడు. సంజూ శాంసన్ వెస్టిండీస్ సిరీస్ లో బాగా ఆడలేక చతికిలబడ్డాడు. దానివల్ల అతడికి ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయం గురించి కూడా డివిలియర్స్ ప్రస్తావించాడు. అతనిని గొప్ప ఆటగాడిగా పేర్కొన్నాడు. డివిలియర్స్ ప్రకారం, శాంసన్‌కు గొప్ప క్రికెట్ స్కిల్స్ ఉన్నాయి, కానీ అతడు ODIలకు అలవాటు పడాలి, ప్రపంచ కప్ ఒత్తిడిని ఎదుర్కోగలగాలి. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ ఇద్దరూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు అయినా వారికి అనుభవం లేకపోవడమే మైనస్ అయిందని ఈ సౌత్ ఆఫ్రికా క్రికెట్ చెప్పాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలుకు బాబు: ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>