Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwyoodb60b3f53-8a06-4941-a544-9ba11aca6a01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwyoodb60b3f53-8a06-4941-a544-9ba11aca6a01-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకసారి మంచి సక్సెస్ చూస్తే మళ్ళీ ఇండస్ట్రీని వదిలి పెట్టాలని అనిపించదు కానీ కొంతమందిని దురదృష్టం వెంటాడుతుంది. సక్సెస్ ఒక్కసారి మాత్రమే వాళ్ళకి రాసిపెట్టి ఉన్నట్లు వరుసగా ఫ్లాప్స్ పలకరిస్తుంటాయి. చివరికి వారు ఏ అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీని అయిష్టంగానే వీడాల్సి వస్తుంది. అలాంటి వారిలో ఇద్దరు డైరెక్టర్ల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. "మీ శ్రేయోభిలాషి" సినిమా ఎంత మంచి మెసేజ్ తో వచ్చిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ టీవీలో వస్తే ఇప్పటికే స్క్రీన్‌కు Tollwyood{#}eeshwar reddy;manorama;rajendra prasad;varun sandesh;School;Film Industry;Happy days;Athadu;Eshwar;Manasantha Nuvve;Romantic;BEAUTY;Audience;Director;Success;Cinemaకెరీర్ లో సూపర్ హిట్స్ కొట్టి కూడా.. కనుమరుగైన డైరెక్టర్లు వీళ్ళే?కెరీర్ లో సూపర్ హిట్స్ కొట్టి కూడా.. కనుమరుగైన డైరెక్టర్లు వీళ్ళే?Tollwyood{#}eeshwar reddy;manorama;rajendra prasad;varun sandesh;School;Film Industry;Happy days;Athadu;Eshwar;Manasantha Nuvve;Romantic;BEAUTY;Audience;Director;Success;CinemaSun, 10 Sep 2023 18:06:00 GMTసినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకసారి మంచి సక్సెస్ చూస్తే మళ్ళీ ఇండస్ట్రీని వదిలి పెట్టాలని అనిపించదు కానీ కొంతమందిని దురదృష్టం వెంటాడుతుంది. సక్సెస్ ఒక్కసారి మాత్రమే వాళ్ళకి రాసిపెట్టి ఉన్నట్లు వరుసగా ఫ్లాప్స్ పలకరిస్తుంటాయి. చివరికి వారు ఏ అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీని అయిష్టంగానే వీడాల్సి వస్తుంది. అలాంటి వారిలో ఇద్దరు డైరెక్టర్ల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

"మీ శ్రేయోభిలాషి" సినిమా ఎంత మంచి మెసేజ్ తో వచ్చిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ టీవీలో వస్తే ఇప్పటికే స్క్రీన్‌కు అతుక్కుపోయి చూసే వాళ్ళు ఉన్నారు. ఇంత మంచి హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పేరు ఈశ్వర్ రెడ్డి ( eshwar Reddy ). నిజానికి ఈ మూవీ అతడికి మొదటిది. రాజేంద్రప్రసాద్ హీరోగా రూపొందిన ఈ సినిమాతో అతను మంచి హిట్ కొట్టాడు. నట కిరీటి రాజేంద్రప్రసాద్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచిందీ మూవీ.

ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసిన తర్వాత ఈశ్వర్ రెడ్డి హాట్ బ్యూటీ ఛార్మితో కలిసి మనోరమ పేరుతో ఒక మూవీ తీశాడు. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించాడు కానీ ఎందుకో ఇది బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. సినీ విమర్శకుల నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయి. అనంతరం హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ ను హీరోగా పెట్టి బ్రహ్మీ గాడి కథ అనే ఫన్నీ మూవీ రూపొందించాడు. అది యావరేజ్ గా ఆడింది. ఇంకొక సినిమా తీసి తనను తాను నిరూపించుకుందామని ఈశ్వర్ రెడ్డి ఎంతో తపనపడ్డాడు కానీ అతడికి ఆ అవకాశం మాత్రం సినీ ఇండస్ట్రీ అందించలేదు. దాంతో తెర మరుగు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డి చేపల బిజినెస్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇతడి లాంటి ఫేట్ అనుభవించిన మరో డైరెక్టర్ అంజి శ్రీను. నటుడు రోహిత్ హీరోగా "జానకి వెడ్స్ శ్రీరామ్" పేరుతో ఒక రొమాంటిక్ డ్రామా మూవీని తెరకెక్కించాడు అంజి. మనసంతా నువ్వే నువ్వే వంటి సినిమాలను మిక్స్ చేసి తీస్తే ఎంత బాగుంటుందో అట్లనే జానకి వెడ్స్ శ్రీరామ్‌ సినిమా ఉండటంతో ప్రేక్షకులు బాగా చూశారు. ఈ మూవీలోని "రివ్వున ఎగిరే గువ్వ" పాట సూపర్ హిట్ అయింది. మొత్తం మీద 2003 వ సంవత్సరంలో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ విజయంతో అంజి వద్దకు స్టార్ హీరోలు కూడా వచ్చి సినిమా చేయాలని కోరారు. అయితే దురదృష్టం కొద్దీ అతడు కామెడీ మూవీ చేయాలనుకున్నాడు.

అందుకు రాజేంద్రప్రసాద్ ని ఎంపిక చేసుకొని అప్పారావు డ్రైవింగ్ స్కూల్ పేరుతో సినిమా తీశాడు. ఈ మూవీ ఊహించని రీతిలో ఫ్లాప్ అయ్యింది. దాంతో షాకైన సదరు డైరెక్టర్ వెంటనే బ్రేక్ తీసుకున్నాడు. అనంతరం తారకరత్నతో  కలిసి నందీశ్వరుడు అనే మూవీ తీశాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. అనంతరం అతడి వైపు హీరోలు చూడటమే మానేశారు. చివరికి ఒక చిన్న సినిమా అవకాశం రావడంతో అది చేశాడు కానీ పెద్దగా ఆడలేదు. డైరెక్టర్ అంజి ఫ్లాప్ రికార్డులను చూసి ప్రొడ్యూసర్లు ఎవరూ కూడా అతనితో కలిసి సినిమాలు చేసేందుకు ధైర్యం చేయలేదు దాంతో ప్రస్తుతం బిజినెస్ లు చేసుకుంటూ బతుకుతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలుకు బాబు: ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>