Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni31976025-9770-4c66-8c23-8e76d7e8be1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni31976025-9770-4c66-8c23-8e76d7e8be1c-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియన్ యువ క్రికెటర్ కామెరాన్ గ్రీన్ 2023లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. తాజాగా ఈ ప్లేయర్ తన ఐపీఎల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను న్యూస్ మీడియాతో పంచుకున్నాడు. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ MS ధోనీ అపారమైన పాపులారిటీని తాను చూసినట్లు పేర్కొన్నాడు. 41 ఏళ్ల ఎమ్‌ఎస్ ధోనీ తమ జట్టు అయిన ముంబై ఇండియన్స్‌తో ఆడుతున్నప్పుడు కూడా ఐపీఎల్ స్టేడియంలలో అభిమానుల నుంచి చాలా ప్రేమను అందుకున్నాడని చెప్పుకొచ్చాడు. అతను బ్యాటింగ్‌కి వచ్చినప్పుడల్లా జనం పెద్ద పెట్టున కేరింతలు కొడుతుండగా, సిక్సర్ Dhoni{#}Mumbai;MS Dhoni;Chennai;Australia;Athadu;Audi;Cricket;september;Yuvaధోనీ దేవుడు లాంటి వ్యక్తి.. ఆస్ట్రేలియన్ యువ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?ధోనీ దేవుడు లాంటి వ్యక్తి.. ఆస్ట్రేలియన్ యువ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Dhoni{#}Mumbai;MS Dhoni;Chennai;Australia;Athadu;Audi;Cricket;september;YuvaSun, 10 Sep 2023 13:30:00 GMTఆస్ట్రేలియన్ యువ క్రికెటర్ కామెరాన్ గ్రీన్ 2023లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. తాజాగా ఈ ప్లేయర్ తన ఐపీఎల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను న్యూస్ మీడియాతో పంచుకున్నాడు. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ MS ధోనీ అపారమైన పాపులారిటీని తాను చూసినట్లు పేర్కొన్నాడు. 41 ఏళ్ల ఎమ్‌ఎస్ ధోనీ తమ జట్టు అయిన ముంబై ఇండియన్స్‌తో ఆడుతున్నప్పుడు కూడా ఐపీఎల్ స్టేడియంలలో అభిమానుల నుంచి చాలా ప్రేమను అందుకున్నాడని చెప్పుకొచ్చాడు.

అతను బ్యాటింగ్‌కి వచ్చినప్పుడల్లా జనం పెద్ద పెట్టున కేరింతలు కొడుతుండగా, సిక్సర్ బాదినప్పుడల్లా ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం నెలకొందని అన్నాడు. ధోనీ తన అభిమానులకు దేవుడిలాంటి వ్యక్తిగా అభివర్ణించిన కామెరాన్ గ్రీన్, అతనితో కలిసి మైదానంలో ఆడటం అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. మంచి ప్రవర్తన ఉన్న ధోనీ ఒక లవ్లీ బాయ్ అంటూ అతడు పొగడ్తలతో ముంచేసాడు.

కామెరాన్ గ్రీన్ IPLలో బెస్ట్ డెబ్యు పర్ఫామెన్స్ అందించాడు. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో సహాయపడ్డాడు. అతను రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో 452 పరుగులు చేశాడు, 50 సగటుతో, 160 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ మల్టీ టాలెంటెడ్ ప్లేయర్ బౌలింగ్‌లో ఆరు వికెట్లు కూడా తీసి వావ్ అనిపించాడు.

24 ఏళ్ల కామెరాన్ గ్రీన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే, ఇటీవలే తొలి వన్డేలో కగిసో రబాడ వేసిన బౌన్సర్‌కు తగలడంతో అతడు కుప్పకూలిపోయాడు. ఫలితంగా, అతను రెండో వన్డేలో ఆడలేకపోయాడు. మూడు, నాల్గవ మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. సెప్టెంబర్ 17న జరిగే చివరి వన్డే కోసం అతను తిరిగి జట్టులోకి రావాల్సి ఉంది. స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి పలువురు కీలక ఆటగాళ్లు పలు గాయాలతో బాధపడుతుండడంతో ఆస్ట్రేలియా జట్టు సవాళ్లను ఎదుర్కొంటోంది.

ఇకపోతే, మహేంద్ర సింగ్ ధోనీ యూఎస్ఎలో విహారయాత్రలో ఉన్నాడు. ఈ స్టార్ ప్లేయర్ IPL 2023లో మోకాలి గాయం ఉన్నా అలానే ఆడి ఎనిమిది గేమ్‌లలో 182.46 స్ట్రైక్ రేట్‌తో 10 సిక్స్‌లతో 104 రన్స్ చేసి తన సత్తా చాటాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదవ IPL ట్రోఫీని వంటి చేత్తో అందించి తన పని ఇంకా అయిపోలేదని చెప్పకనే చెప్పాడు. కాగా ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న ఈ దిగ్గజ ప్లేయర్ స్వదేశానికి కొద్ది రోజుల్లో తిరిగి వస్తాడని, మోకాలి గాయం నుంచి రికవరీ అయ్యాక త్వరలో క్రికెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో అలరిస్తున్న సమీరా రెడ్డి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>