MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money8e941837-87d3-489a-94b7-6774f4c6a177-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money8e941837-87d3-489a-94b7-6774f4c6a177-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో వివిధ రకాల పథకాలలో చాలామంది డబ్బులు పెడుతూ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఇతర ఆదాయ వనరులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వ్యాపారం చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చడానికి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం సరికొత్తగా ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలోని వ్యాపారం చేసే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వడ్డీ రహిత రుణాలను అందించడానికి ఒక పథకాన్ని అందుబాMONEY{#}central government;GovernmentMoney: మహిళలకి గుడ్ న్యూస్.. వడ్డీ లేని రుణం..!Money: మహిళలకి గుడ్ న్యూస్.. వడ్డీ లేని రుణం..!MONEY{#}central government;GovernmentSun, 10 Sep 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో వివిధ రకాల పథకాలలో చాలామంది డబ్బులు పెడుతూ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఇతర ఆదాయ వనరులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వ్యాపారం చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చడానికి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం సరికొత్తగా ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలోని వ్యాపారం చేసే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వడ్డీ రహిత రుణాలను అందించడానికి ఒక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ పథకం ద్వారా మహిళలకు రూ.3 లక్షల వరకు లోన్ లభించడమే కాదు.. వీటిపై వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం సూచించిన 88 రకాల వ్యాపారాలలో ఏదైనా ఒకటి మీరు ఎంచుకొని లోన్ పొందవచ్చు. ఇక వివరాల్లోకి వెళితే ముఖ్యంగా అంగవైకల్యం,  వితంతువులకు లోన్ తీసుకోవడంలో ఎటువంటి పరిమితి లేదు. వారి అర్హతలు,  పెట్టే వ్యాపారాన్ని బట్టి లోన్ లభిస్తుంది . ముఖ్యంగా మహిళలు ఈ పథకం ద్వారా తమ సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఉంటుంది. ఇకపోతే కేంద్రం ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశం అంతట ఈ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంత మహిళల కోసమే ప్రత్యేకంగా దీనిని రూపొందించగా పేదలు,  నిరక్షరాస్యత నుంచి వచ్చిన మహిళలు ఈ పథకం ద్వారా మద్దతు పొందుతారు.

18 నుంచి 55 సంవత్సరాలు వయసున్న మహిళలు ఇందుకు అర్హులు.. కుటుంబ సమస్యల ఆదాయం తప్పనిసరిగా రూ.లక్షన్నరకు మించి ఉండకూడదు అవసరమైన లోన్ మొత్తం రూ .3లక్షలకు మించకూడదు. ఇంతకుమించి ఎక్కువ లోన్ తీసుకుంటే మహిళలకు 12 శాతం వడ్డీతో లోన్ ఇవ్వడం జరుగుతుంది . అయితే ఈ వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"జవాన్" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>