MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/south-directors0e9c5132-ee12-4087-bb60-c036cff2ebc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/south-directors0e9c5132-ee12-4087-bb60-c036cff2ebc6-415x250-IndiaHerald.jpg కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తూ హాట్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా కీలక పాత్ర పోషించిన చిత్రం జవాన్ సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై అటు షారుఖ్ ఖాన్ కు ఇటు బాలీవుడ్ సినిమా పరిశ్రమకు మంచి ఊరట కలిగించిందని చెప్పాలి.పఠాన్ సినిమా నుంచి జవాన్ సినిమా దాకా బాలీవుడ్ సినిమా పరిశ్రమను బ్రతికిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్.ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు బాలీవుడ్ సినీ ప్రేక్షకులు.. ఉండగా ఇప్పటికే జవాన్ సినిమా విడుదSouth directors{#}king;Kabir singh;King;Varsham;prasanth;atlee kumar;Kollywood;you tube;Prashant Kishor;sandeep;Telugu;Jawaan;Rajamouli;Shahrukh Khan;shankar;Blockbuster hit;Heroine;BEAUTY;Chitram;bollywood;ram pothineni;India;Cinema;september;Indian;Director;Hindiబాలీవుడ్ ని శాసిస్తున్న మన సౌత్ డైరెక్టర్స్.. నెక్స్ట్ అతడే?బాలీవుడ్ ని శాసిస్తున్న మన సౌత్ డైరెక్టర్స్.. నెక్స్ట్ అతడే?South directors{#}king;Kabir singh;King;Varsham;prasanth;atlee kumar;Kollywood;you tube;Prashant Kishor;sandeep;Telugu;Jawaan;Rajamouli;Shahrukh Khan;shankar;Blockbuster hit;Heroine;BEAUTY;Chitram;bollywood;ram pothineni;India;Cinema;september;Indian;Director;HindiSat, 09 Sep 2023 18:42:00 GMT కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తూ హాట్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా కీలక పాత్ర పోషించిన చిత్రం జవాన్ సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై అటు షారుఖ్ ఖాన్ కు ఇటు బాలీవుడ్ సినిమా పరిశ్రమకు మంచి ఊరట కలిగించిందని చెప్పాలి.పఠాన్ సినిమా నుంచి జవాన్ సినిమా దాకా బాలీవుడ్ సినిమా పరిశ్రమను బ్రతికిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్.ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు బాలీవుడ్ సినీ  ప్రేక్షకులు..  ఉండగా ఇప్పటికే జవాన్ సినిమా విడుదల అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.129 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని టచ్ చేసి ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది జవాన్.జవాన్ సినిమా మొదటి రోజే ఇండియాలో ఏకంగా రూ.75 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా.. ఇక రెండవ రోజు మొత్తం రూ.53 కోట్లు వసూలు చేసింది . మొత్తం గా రెండు రోజుల్లోనే ఇండియా వైడ్ గా చూసుకుంటే ఈ సినిమా రూ. 127 కోట్లు రాబట్టగా.. అందులో హిందీ పరిశ్రమ నుంచి 47 కోట్ల రూపాయలు రాబడినట్లు సమాచారం.ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది.ఈ సినిమా మొదటి రోజు 100 కోట్ల పైగా గ్రాస్ రాబట్టిన 8 వ సినిమాగా నిలిచింది. అలాగే షారుఖ్ ఖాన్ కి కూడా 100 కోట్ల పైగా డే 1 వసూళ్లు రాబట్టిన 2 వ సినిమాగా ఈ సినిమా నిలిచింది.


ఈ సినిమాని బాయ్ కాట్ చెయ్యాలంటూ బాయ్ కాట్ బ్యాచ్ నేషనల్ లెవెల్ లో ట్రెండ్ స్టార్ట్ చేసింది.కానీ జవాన్ కి వచ్చిన రెస్పాన్స్ బాయ్ కాట్ బ్యాచ్ ఒంటి కాలితో తన్నేసింది. అసలు రీసెంట్ టైమ్స్ లో బాయ్ కాట్ ట్రెండ్ బాగా తగ్గిపోయింది. అసలు దాని ఇంపాక్ట్ ఏమాత్రం కనిపించడం లేదు. ఇక బాలీవుడ్ డైరెక్టర్స్ మన సౌత్ స్టార్స్ కి రాడ్ లాంటి ఫ్లాప్స్ ఇస్తుంటే సౌత్ డైరెక్టర్స్ మాత్రం బాలీవుడ్ స్టార్స్ కి కేరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, AR మురుగదాస్, సందీప్ రెడ్డి వంగా తాజాగా అట్లీ వంటి సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ బాలీవుడ్ స్టార్స్ కి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.ఎస్ ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, శంకర్ ఇప్పటిదాకా బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీ చేయకపోయినా మన సౌత్ సినిమాలతో అక్కడ తమ మార్క్ ని క్రియేట్ చేశారు. రాజమౌళి అయితే ఏకంగా దేశంలోనే నెంబర్ 1 డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈసారి సందీప్ రెడ్డి వంగా స్ట్రెయిట్ హిందీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ పై కన్నేశాడు.ఆల్రెడీ కబీర్ సింగ్ తో తానేంటో బాలీవుడ్ కి చూపించిన సందీప్ ఇప్పుడు రన్బీర్ కపూర్తో చేస్తున్న యానిమల్ సినిమాతో మరోసారి బాలీవుడ్ కి తెలుగు డైరెక్టర్ సత్తా చూపించేందుకు సిద్ధం అయ్యాడు. ఇక యానిమల్ ప్రీ టీజర్ యూట్యూబ్ ని ఏ విధంగా షేక్ చేసిందో చెప్పనవసరం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్‌.. బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వరా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>